పిఎంఇండియా
భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాల ప్రయాణం అద్భుతమైన వేగంతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అన్నారు. భారత్‌లో దాదాపు రూ. 3 లక్షల కోట్లు (30 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టటంతో పాటు 5 గిగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్లను అభివృద్ధి చేయనున్నట్లు ఎయిర్‌ట్రంక్ సంస్థ ప్రకటించిన విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. దేశ డిజిటల్ మౌలిక సదుపాయాల విషయంలో రాబోతున్న అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ఒకటిగా ఆయన అన్నారు.
ఇలాంటి పెట్టుబడులు క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ రంగాల్లో ప్రపంచ కేంద్రంగా భారతదేశ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయని ప్రధాని పేర్కొన్నారు. ఇది ఒకేసారి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించడంతో పాటు స్థానిక సరఫరా గొలుసులను బలోపేతం చేస్తుందని, ఆవిష్కరణల ఆధారిత వృద్ధిని వేగవంతం చేస్తుందని ఆయన ఉద్ఘాటించారు. ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తును భారతదేశమే ఎక్కువగా ప్రభావితం చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు:
“భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాల ప్రయాణం అద్భుతమైన వేగంతో ముందుకు సాగుతోంది.
మన దేశంలో దాదాపు రూ. 3 లక్షల కోట్ల (30 బిలియన్ డాలర్ల) పెట్టుబడి పెట్టటంతో పాటు 5 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లను అభివృద్ధి చేయనున్నట్లు ఎయిర్‌ట్రంక్ సంస్థ ప్రకటించింది. దేశ డిజిటల్ మౌలిక సదుపాయాల వ్యవస్థలో రాబోతున్న అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ఒకటి.
ఇలాంటి పెట్టుబడులు క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ రంగాల్లో ప్రపంచ కేంద్రంగా భారతదేశ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఇవి ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి.. స్థానిక సరఫరా గొలుసులకు అండగా నిలుస్తాయి.. ఆవిష్కరణల ఆధారిత వృద్ధిని వేగవంతం చేస్తాయి.
ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు భారతదేశంలోనే ఎక్కువగా రూపుదిద్దుకుంటోందనేది ఇప్పుడు స్పష్టమవుతోంది.”
***
India’s digital infrastructure journey is gathering remarkable momentum.
— Narendra Modi (@narendramodi) June 5, 2026
AirTrunk has announced plans to invest around Rs. 3 lakh crore ($30 billion) in India, and develop 5 GW of data centre capacity. This is among the largest proposed investments in the country’s digital… pic.twitter.com/ZW82nneN5x