Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రకృ‌తితో సామరస్యం, సర్వ ప్రాణుల సంక్షేమాన్ని తెలిపే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


ప్రకృతితో సమతౌల్యాన్ని ఏర్పరుచుకోవడం ద్వారా సకల ప్రాణుల సంక్షేమానికీ పాటుపడడం మన సంస్కృతిలో మూల భావనగా ఉందని చెబుతున్న ఓ సంస్కృత భాషా సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
ఈ సంపూర్ణ దృష్టికోణంతో భారత్ ప్రగతి, సమృద్ధిల మార్గంలో ప్రస్తుతం ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘ప్రకృతితో  సమతౌల్యాన్ని ఏర్పరుచుకొని సమస్త జీవుల సంక్షేమాన్ని కోరుకోవడం మన సంస్కృతిలో మూల భావనగా ఉంది. ఈ విస్తృత దృష్టితో భరతవర్షం  ప్రస్తుతం ప్రగతి, సమృద్ధిల బాటలో నిరంతరం ముందుకు పయనిస్తోంది.
యావచ్చతస్త్రః ప్రదిశశ్చక్షుర్యావత్ సమశ్నుతే
తావత్ సమైత్విన్ద్రియం మయి తద్ధస్తివర్చసమ్’’
నాలుగు దిక్కులా విస్తరించివుండే సమృద్ధిని సాధించెదము గాక, దూరదృష్టితో పరిపూర్ణులమయ్యెదము గాక.. ప్రకృతితో పూర్తి సద్భావనతో ఉంటూ, పర్యావరణాన్ని సంరక్షిస్తూ, అన్ని ప్రాణుల నిరంతర సంక్షేమానికీ కృషి చేసెదము గాక అని పైన చెప్పిన సంస్కృత సుభాషితం మనకు బోధిస్తోంది’’ అని పేర్కొన్నారు.