పిఎంఇండియా
ఫిలిప్పీన్స్‌లోని మిండానోలో ఈ రోజు సంభవించిన భూకంపం వల్ల జరిగిన ప్రాణనష్టం, విధ్వంసం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన ప్రధానమంత్రి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
ఫిలిప్పీన్స్ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ అండగా నిలుస్తుందని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
ఫిలిప్పీన్స్‌లోని మిండానోలో ఈ రోజు సంభవించిన భూకంపం వల్ల ప్రాణనష్టం, విధ్వంసం జరగడం విచారకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. ఫిలిప్పీన్స్ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ అండగా ఉంటుంది.
***
Saddened by the loss of lives and destruction caused by today’s earthquake in Mindanao, Philippines. My heartfelt condolences to the bereaved families and prayers for the speedy recovery of those injured. India stands in solidarity with the people and the Government of the…
— Narendra Modi (@narendramodi) June 8, 2026