పిఎంఇండియా
నేను 2026 జులై 6 నుంచి 11 వరకు మూడు దేశాలు… ఇండొనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పర్యటిస్తాను.
ఇండొనేషియా అధ్యక్షుడు శ్రీ ప్రబొవొ సుబియాంతొ ఆహ్వానించడంతో, నేను ఈ నెల 6 నుంచి 8 వరకూ ఇండొనేషియాలో పర్యటిస్తాను. 2018లో నేను మొదటిసారి ఇండొనేషియా పర్యటనకు వెళ్లినప్పుడు భారత్, ఇండొనేషియా తమ ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంపొందింపచేసుకున్నాయి. ద్వైపాక్షిక సంబంధాల స్థాయి పెరిగిన తరువాత ఇదే నేను చేపట్టబోయే మొదటి ద్వైపాక్షిక పర్యటన. అధ్యక్షుడు శ్రీ ప్రబొవొ అధికార పర్యటన అనంతరం నా ఈ పర్యటన చోటుచేసుకోనుంది. అప్పట్లో అంటే.. 2025 జనవరి 26న ఆయన మన గణతంత్ర దినోత్సానికి ముఖ్య అతిథిగా వచ్చారు. భారత్, ఇండొనేషియా మధ్య బలమైన నాగరికత సంబంధమైన ప్రజా సంబంధాలు నెలకొన్నాయి. నా ఈ పర్యటన మన బహుముఖీన భాగస్వామ్యానికి చెందిన అన్ని అంశాలనూ మరింత దృఢతరంగా మారుస్తుంది. నా పర్యటన కాలంలో, నేను ఇండొనేషియాలో నివసిస్తున్న ప్రవాసీ భారతీయులతోనూ సమావేశమవుతాను. అధ్యక్షుడు శ్రీ ప్రబొవొతో కలిసి యోగ్యకర్తలోని ప్రంబానన్ దేవాలయ పరిసరాలను సందర్శిస్తాను. ఆ దేవాలయం మన సన్నిహిత సాంస్కృతిక సంబంధాలకు మరొక అద్భుత నిదర్శనంగా నిలుస్తుంది.
ఇండొనేషియా నుంచి, నేను ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఆంథోనీ అల్బనీజ్ ఆహ్వానంపై మెల్బోర్న్కు పయనమవుతాను. నా ఈ పర్యటన మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తుంది. ప్రధాని శ్రీ అల్బనీజ్‌తో పాటు నేను నిర్వహించే చర్చల్లో రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, అనుసంధానం, రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు.. ఈ రంగాల్లో మన సంబంధాలు బలపడతాయి. మెల్బోర్న్లో ప్రవాసీ భారతీయులతో భేటీ అయ్యే అవకాశం నాకు కలగనుంది. ప్రవాసీ భారతీయులు మన వ్యూహాత్మక భాగస్వామ్యామ్యంలో ఒక ముఖ్యాధారంగా నిలుస్తున్నారు. దీనికి అదనంగా, ఈ పర్యటన భారత్, ఆస్ట్రేలియా మధ్య సరికొత్తగా ఉనికిలోకి వస్తున్న కీలక సాంకేతికతలు, క్రీడలు, స్పోర్ట్స్ సైన్స్ రంగాల్లో మన ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా దృఢతరంగా మార్చుకొనే అవకాశాన్ని కూడా అందిస్తుంది.
న్యూజిలాండ్ ప్రధాని శ్రీ క్రిస్టఫర్ లక్సన్ ఆహ్వానించడంతో, నేను మెల్బోర్న్ నుంచి న్యూజిలాండ్ లోని ఆక్లాండ్‌లో పర్యటించనున్నాను. నా ఈ పర్యటన 2025 మార్చి నెలలో ప్రధాని శ్రీ లక్సన్ భారత్‌లో పర్యటించిన తరువాత మన ద్వైపాక్షిక సంబంధాల్లో చోటు చేసుకున్న దృఢత్వాన్ని మరింత పటిష్ఠపరచనుంది. ఈ పర్యటన కాలంలో, నేను ప్రధాని శ్రీ లక్సన్తో కలిసి ఆర్థిక, వాణిజ్య, సంబంధాలను బలోపేతం చేసుకొనే పద్ధతులపై చర్చిస్తాను. భారత్, న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకొని ద్వైపాక్షిక వాణిజ్యం, వాణిజ్య సంబంధాలను బలపరుచుకోవాలన్న ఆసక్తిని చాటాయి. మన ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రవాసీ భారతీయులందించిన తోడ్పాటు ముఖ్యమైంది. ఈ పర్యటన కాలంలోనే, నేను ప్రవాసీ భారతీయులు పాల్గొనే పెద్ద సభను ఉద్దేశించి ప్రసంగించేందుకు ఆసక్తితో ఎదురు చూస్తున్నాను. వారు జీవితంలో అన్ని రంగాల్లోనూ శ్రేష్ఠమైన పనితీరును కనబరుస్తున్నారు.
తూర్పు, దక్షిణ హిందూ మహాసముద్రంలో నెలకొన్న ఇండొనేషియా, ఆస్ట్రేలియాలతో పాటు ఈ రెండు దేశాల తరువాత న్యూజిలాండ్‌లో నా పర్యటన భారత్ అనుసరిస్తున్న ‘ఈస్ట్ ఇండియా పాలిసీ’, మహాసాగర్ (MAHASAGAR) దార్శనికతతో పాటు స్వతంత్ర, బహిరంగ ఇండో-పసిఫిక్‌ను ఆవిష్కరించాలన్న మన దృష్టికోణాన్ని మరింత బలపరుస్తుంది.
***
Over the next few days, I will be attending various programmes in Indonesia, Australia and New Zealand. The aim of these meetings would be to boost economic and strategic cooperation with these valued developmental partners and ensure the youth of our nation get more…
— Narendra Modi (@narendramodi) July 6, 2026