పిఎంఇండియా
సాహసం ఏ దేశానికైనా అన్నింటి కన్న పెద్ద బలం అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఇది, కఠిన సవాళ్లు ఎదురైనప్పటికీ దేశం సమైక్యంగా ప్రగతి, సౌభాగ్యం, స్వయం సమృద్ధి దిశగా నిరంతరం ముందుకు సాగిపోవడానికి స్ఫూర్తిని అందిస్తుందని ఆయన అన్నారు.
‘‘చలన్తి గిరయః కామం యుగాన్తపవనాహతాః
కృచ్ఛ్రేపి న చలత్యేవ ధీరాణాం నిశ్చలం మనః’’ అనే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు.
పర్వతాలు కూడా పెను విపత్తు ముంచుకొచ్చే వేళ తుపాను వాతావరణంలో మాదిరిగా తీవ్ర వేగంతో వీచే గాలులకు కంపించి, ముక్కచెక్కలవుతాయి, అయినప్పటికీ అత్యంత కఠిన పరిస్థితులు ఎదురైనా దృఢమైన వ్యక్తి మనసు చలించకుండా, శాంతంగా ఉంటుంది అని ఈ సుభాషితం మనకు చెబుతోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘ఏ దేశానికైనా అతి పెద్ద శక్తి ధైర్యం. దీంతో, కఠిన సవాళ్ల నడుమ కూడా దేశం ఏకతాటి మీద నిలవడమే కాకుండా ప్రగతి, సౌభాగ్యం, స్వయం సమృద్ధి దిశగా నిరంతరం ముందుకు సాగాలన్న స్ఫూర్తిని కూడా పొందుతుంది.
‘‘చలన్తి గిరయః కామం యుగాన్తపవనాహతాః
కృచ్ఛ్రేపి న చలత్యేవ ధీరాణాం నిశ్చలం మనః’’ అని పేర్కొన్నారు.
धैर्य किसी राष्ट्र की सबसे बड़ी शक्ति है। इससे कठिन चुनौतियों के बीच भी देश को एकजुट रहने के साथ ही प्रगति, समृद्धि और आत्मनिर्भरता की दिशा में निरंतर आगे बढ़ने की प्रेरणा मिलती है।
— Narendra Modi (@narendramodi) July 8, 2026
चलन्ति गिरयः कामं युगान्तपवनाहताः।
कृच्छ्रेऽपि न चलत्येव धीराणां निश्चलं मनः।। pic.twitter.com/r98zJBGmwE