పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంస్కృత శ్లోకాన్ని పంచుకున్నారు. విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవడం, ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా భారత భవిష్యత్తును తీర్చిదిద్దడంలో దేశ యువత బలమైన శక్తిగా ఎదుగుతోందని పేర్కొన్నారు. ఈ లక్షణాలు వ్యక్తులను శక్తిమంతం చేయడమే కాకుండా.. దేశాభివృద్ధికి గణనీయమైన రీతిలో తోడ్పాటును అందిస్తాయి.
ప్రధానమంత్రి పంచుకున్న సంస్కృత శ్లోకం –
‘‘ధన్యానాముత్తమం దాక్ష్యం ధనానాముత్తమం శ్రుతమ్ |
లాభానాం శ్రేయ ఆరోగ్యం సుఖానాం తుష్టిరుత్తమా || ’’
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:
విద్యతో వివేకం, నైపుణ్యంతో అభివృద్ధి సాధ్యమవుతుంది. మంచి ఆరోగ్యంతో ప్రతి సంకల్పమూ నెరవేరుతుంది. ఇప్పుడు మన యువత ఈ గుణాలను అలవర్చుకొని దేశ గుర్తింపును మరింత బలోపేతం చేస్తున్నారు.
ధన్యానాముత్తమం దాక్ష్యం ధనానాముత్తమం శ్రుతమ్ |
లాభానాం శ్రేయ ఆరోగ్యం సుఖానాం తుష్టిరుత్తమా ||
***
विद्या से विवेक, कौशल से विकास और उत्तम स्वास्थ्य से हर संकल्प को सिद्धि मिलती है। आज हमारे युवा इन्हीं गुणों को आत्मसात कर देश की पहचान को और सशक्त बना रहे हैं।
— Narendra Modi (@narendramodi) July 15, 2026
धन्यानामुत्तमं दाक्ष्यं धनानामुत्तमं श्रुतम्।
लाभानां श्रेय आरोग्यं सुखानां तुष्टिरुत्तमा।। pic.twitter.com/PAdc1EH63L