పిఎంఇండియా
కచ్చి నూతన సంవత్సర వేడుక ఆషాఢీ బీజ్ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ విదేశాల్లో నివసిస్తున్న కచ్చి సోదర సోదరీలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. విశాలమైన మహాసముద్రంలో చేపలు ఎంత హాయిగా జీవిస్తాయో.. ప్రపంచవ్యాప్తంగా కచ్చి ప్రజలు కూడా అలాగే వర్ధిల్లుతున్నారని ప్రధాని కొనియాడారు. ప్రపంచంలో ఏ మూలన ఒక్క కచ్చి నివాసి ఉన్నా.. అక్కడ ప్రతిరోజూ కచ్ ప్రాంతపు జీవకళ, వైభవం సజీవంగా ఉట్టిపడుతూనే ఉంటాయని వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
మహాసముద్రంలో చేపలు ఎంత స్వేచ్ఛగా, సంతోషంగా విహరిస్తాయో.. ఈ విశాల ప్రపంచంలో కచ్ ప్రజలు కూడా అంతగా విస్తరించి అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రపంచంలో ఏ మూలన ఒక్క కచ్చి నివాసి నివసిస్తున్నా.. అక్కడ ప్రతిరోజూ కచ్ ప్రాంతపు సంస్కృతి, జీవకళ ఉట్టిపడుతూనే ఉంటాయి.
ఈ రోజు ఆషాఢీ బీజ్ అంటే కచ్చి ప్రజల నూతన సంవత్సరం. దేశ విదేశాలలో నివసిస్తున్న నా కచ్చి సోదర సోదరీలందరికీ నూతన సంవత్సర ‘రామ్ రామ్’ శుభాకాంక్షలు, హృదయపూర్వక అభినందనలు.
***
કચ્છડ઼ો ખેલે ખલકમેં જીં મહાસાગરમેં મચ્છ, જિતે હિકડ઼ો કચ્છી વસે ઉતે ડીંયા ડીં કચ્છ.
— Narendra Modi (@narendramodi) July 16, 2026
અજ આષાઢી બીજ એટલે કચ્છી નયોં વરેં, દેશ અને દુનિયાંમેં વસંધલ કચ્છી ભા-ભેંણેંકે કચ્છી નયેં વરેંજા રામ રામ અને જિજી જિજી વધાઇયું.