పిఎంఇండియా
సీఆర్‌పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిబ్బందికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అచంచలమైన ధైర్యం, విధి నిర్వహణ పట్ల నిబద్ధతతో
సీఆర్‌పీఎఫ్ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుందని పేర్కొన్నారు.
అంతర్గత భద్రతను పరిరక్షించటం నుంచి క్లిష్ట పరిస్థితుల్లో పౌరులకు సేవ చేయటం వరకు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఎప్పుడూ దేశానికే ప్రాధాన్యతనిచ్చారని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మావోయిజాన్ని రూపుమాపేందుకు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కృషి చేశారని.. ఎంతోమంది ప్రజల జీవితాల్లో శాంతి, పురోగతికి దోహదపడ్డారని కొనియాడారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి ఇలా పంచుకున్నారు.
“సీఆర్‌పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అచంచలమైన ధైర్యం, విధి నిర్వహణ పట్ల నిబద్ధతతో సీఆర్‌పీఎఫ్ ప్రత్యేక గుర్తింపుని సాధించుకుంది. అంతర్గత భద్రతను పరిరక్షించటం నుంచి క్లిష్ట పరిస్థితుల్లో పౌరులకు సేవ చేయటం వరకు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఎప్పుడూ దేశానికి తొలి ప్రాధాన్యతనిచ్చారు. మావోయిజాన్ని రూపుమాపేందుకు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది విశేషమైన కృషి చేశారు. ఎంతోమంది ప్రజల జీవితాల్లో శాంతి, పురోగతికి దోహదపడ్డారు“
***
Greetings to all CRPF personnel on their Raising Day. The CRPF has distinguished itself through its unwavering courage and commitment to duty. From safeguarding internal security to serving citizens during challenging situations, CRPF personnel have always placed the nation… pic.twitter.com/vfi9v3xR61
— Narendra Modi (@narendramodi) July 27, 2026