పిఎంఇండియా
సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి సమాజంలో గౌరవాన్ని పొందుతారనీ, అలాంటి వ్యక్తిని ప్రతి బాధ్యతా తీసుకోవడానికి సమర్థుడిగా భావిస్తారనీ తెలియజెప్పే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ :
‘‘శీలవాన్ పూజితో లోకే శీలవాన్ సాధుసమ్మతః
శీలవాన్ సర్వకర్మార్హః శీలవాన్ ప్రియదర్శనః’’ అని పేర్కొన్నారు.
‘సదాచార స్వభావాన్ని కలిగివుండే మనిషి సమాజంలో గౌరవాన్నీ, మంచివారి ప్రశంసలనూ పొందుతారు. ఇలాంటి వ్యక్తి తన నిజాయతీ, అణకువ, క్రమశిక్షణతో కూడిన ప్రవర్తన కారణంగా ఏ బాధ్యతనైనా నిర్వహించడానికి తగిన వ్యక్తి అని ప్రజలు భావిస్తారు. ఆ మనిషి వ్యక్తిత్వం ప్రశంసనీయంగాను, స్ఫూర్తిదాయకంగాను ఉండడమే కాక అనుసరణ యోగ్యం కూడా అవుతుంది. నిజానికి సత్ప్రవర్తనను కలిగివుండడం సదా విజయాలకీ, ప్రభావవంతమైన నాయకత్వానికీ, విశ్వాసానికీ సిసలైన పునాదిగా నిలుస్తుంది’ అని మనకు ఈ సుభాషితం బోధిస్తోంది.
***
शीलवान् पूजितो लोके
— Narendra Modi (@narendramodi) July 27, 2026
शीलवान् साधुसम्मतः।
शीलवान् सर्वकर्मार्हः
शीलवान् प्रियदर्शनः॥ pic.twitter.com/SjtiV6kFT1