Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2026 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాన్ని గెలిచిన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుకు ప్రధానమంత్రి అభినందనలు


వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను 2026 కామన్వెల్త్ క్రీడల్లో 48 కిలోల కేటగిరీలో స్వర్ణ పతకాన్ని గెలిచిన సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆమెకు అభినందనలు తెలిపారు.
మీరాబాయి చాను మరో సారి అద్భుత ప్రదర్శనతో తన ప్రతిభను చాటారంటూ ప్రధానమంత్రి ప్రశంసించారు. కామన్వెల్త్ క్రీడల్లో వరుసగా స్వర్ణ పతకాన్ని గెలవడంతో పాటు, ఇంతవరకు మొత్తం నాలుగు కామన్వెల్త్ పతకాలను  ఆమె సొంతం చేసుకొని భారత్‌లో అందరికీ స్ఫూర్తిని అందిస్తున్నారని శ్రీ మోదీ అన్నారు.
రాబోయే కాలంలో కూడా ఆమె అన్ని ప్రయత్నాల్లో రాణించాలని ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘భారత్ వెయిట్‌లిఫ్టింగులో మరో వైభవోపేతమైన అధ్యాయం ఇది.
ప్రతిభావంతురాలైన మీరాబాయి చాను 48 కిలోల కేటగిరీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ మరో సారి కామన్వెల్త్ క్రీడలలో తన కౌశలాన్ని చాటారు. కామన్వెల్త్ క్రీడలలో వరుసగా స్వర్ణ పతకాలతో పాటు, మొత్తంమీద నాలుగో కామన్వెల్త్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుని భారత్‌లో అందరికీ స్ఫూర్తినిస్తున్నారు. ఆమెకు అభినందనలు. రాబోయే కాలంలో కూడా ఆమె రాణించాలని నేను కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.
 
 ***