Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జీవితానికి మార్గదర్శకులు… గురువులే!


గురు పూర్ణిమ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారుగురువులు విద్యార్థులకు జ్ఞానాన్ని పంచడంతో పాటు సకారాత్మక శక్తినిమంచి ఆలోచనల్నిసంస్కారాల్ని కూడా అందిస్తారని ఆయన అన్నారుగురువులు బోధించిన ఆదర్శాలను అందరూ తమ జీవితాలకు మార్గదర్శకంగా మలుచుకోవాలని ప్రధానమంత్రి కోరారు.

‘‘ప్రేరకః సూచకశ్చైవ వాచకో దర్శకస్తథాశిక్షకః బోధకశ్చైవ షడేతే గురవః స్మృతాః’’ అన్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు.

సరైన దారిని చూపే వారూజ్ఞానాన్నీసత్యాన్నీ బోధించే వారూధర్మమార్గాన్ని దర్శింపచేసే వారూవిద్యను అందించడంతో పాటు జీవితంలో సత్యం పట్ల అవగాహనను పెంపొందింప చేసే వారూఆత్మ వికాసానికి బాట వేసే వారూ .. ఇలాంటి వారిని గురువుకు సంబంధించిన ఆరు రూపాలుగా భావిస్తారని ఈ సుభాషితం చెబుతోంది.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ;

‘‘గురు పూర్ణిమ సందర్భంగా దేశ ప్రజలందరికీ అభినందనలుగురువు.. జ్ఞానంతో పాటు సకారాత్మక శక్తినీమంచి ఆలోచనల్నీసంస్కారాల్నీ శిష్యులకు అందిస్తారురండి.. గురువుల ఆదర్శాలను మన జీవితానికి ప్రధానాధారంగా మలుచుకుందాం’’ అని పేర్కొన్నారు.

 

***