Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2026 కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో మహిళల 69 కేజీల విభాగంలో రజతం సాధించిన హర్జీందర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌-2026లో వెయిట్‌లిఫ్టింగ్‌లో మహిళల 69 కేజీల విభాగంలో రజతం సాధించిన హర్జీందర్‌ కౌర్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

హర్జీందర్ ప్రదర్శన వ్యక్తిగతంగా ఉత్తమమైనదనిభారత వెయిట్‌లిఫ్టర్లు అద్భుతంగా రాణించటం సంతోషంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు.

భవిష్యత్తులో హర్జీందర్‌ కౌర్‌ మరిన్ని విజయాలు సాధించాలని శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌-2026లో వెయిట్‌లిఫ్టింగ్‌లో మహిళల 69 కేజీల విభాగంలో రజత పతకం సాధించిన హర్జీందర్‌ కౌర్‌కు శుభాకాంక్షలునిన్న ఆమె చేసిన ప్రదర్శన వ్యక్తిగతంగా ఉత్తమమైనదికామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టర్లు అద్భుతంగా రాణించటం సంతోషకరంభవిష్యత్తులో హర్జీందర్‌ మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నా“.

 

***