Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కామన్వెల్త్ క్రీడలు 2026లో రజత పతకం సాధించిన మహమ్మద్ బాసిల్ మోర్సింగనకత్‌ను అభినందించిన ప్రధానమంత్రి


గ్లాస్గో కామన్వెల్త్ క్రీడలు- 2026లో రజత పతకం సాధించిన మహమ్మద్ బాసిల్ మోర్సింగనకత్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

మహమ్మద్ బాసిల్ ప్రదర్శించిన వేగాన్ని (స్ప్రింట్), పట్టుదలను ప్రధానమంత్రి కొనియాడారు. ఈ ప్రదర్శన అతనికి ఈ సీజన్‌లోనే అత్యుత్తమమైనదని ఆయన పేర్కొన్నారు.

ఈ విజయం మహమ్మద్ బాసిల్ మోర్సింగనకత్‌కు ఉన్న కష్టపడే తత్వానికి, ఏకాగ్రతకు నిదర్శనమని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. భవిష్యత్తులో అతను మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

“మహమ్మద్ బాసిల్ మోర్సింగనకత్‌ అద్భుతమైన తీరులో రజత పతకం సాధించారు. ఎంతటి వేగవంతమైన పరుగు, పట్టుదల ప్రదర్శన! ఈ విజయం సాధించినందుకు, ఈ సీజన్‌లోనే తన అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసినందుకు నా అభినందనలు. అతని విజయం అతని శ్రమను, ఏకాగ్రతను ప్రతిబింబిస్తుంది. రాబోయే కాలంలో అతను మరిన్ని కొత్త శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను”.

 

***