Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

థానేలో భవనం కూలిన ఘటనలో ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధానమంత్రి దిగ్భ్రాంతి


మహారాష్ట్రలోని థానేలో భవనం కూలిన ఘటనలో ప్రాణ నష్టం సంభవించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఈ విషాద ఘటన గురించి విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయినట్లు ప్రధానమంత్రి చెప్పారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మరణించిన వారి కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల ఎక్స్–గ్రేషియాను ప్రధానమంత్రి ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 ఆర్థిక సాయాన్ని అందిస్తారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:

‘‘మహారాష్ట్రలోని థానేలో భవనం కూలిన ఘటనలో ప్రాణనష్టం జరిగిందని విని దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.

మరణించిన వారి కుటుంబానికి పీఎంఎన్ఆర్‌ఎఫ్ నుంచి రూ.2 లక్షల ఎక్స్–గ్రేషియాను అందిస్తాం. గాయపడిన వారికి రూ.50,000 అందజేస్తాం.’’

 

***