Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కామన్వెల్త్‌ క్రీడలు 2026లో పురుషుల జావెలిన్‌లో రజతం గెలుచుకున్న నీరజ్‌ చోప్రాకు ప్రధానమంత్రి అభినందనలు


గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడలు 2026 పురుషుల జావెలిన్‌ త్రో పోటీల్లో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

 

నీరజ్ చోప్రా మరోసారి తన అద్భుతమైన స్థిరత్వం, సంయమనం, క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారని ప్రధాని కొనియాడారు.

 

నీరజ్ చోప్రా సాధించిన విజయాలు ప్రతి భారతీయుడు గర్వపడేలా చేస్తున్నాయని పేర్కొంటూ, భవిష్యత్తులో అతను చేపట్టబోయే ప్రయత్నాలకు ప్రధాని శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

 

‘‘గ్లాస్గోలో జరిగిన పురుషుల జావెలిన్ పోటీల్లో నీరజ్ చోప్రా అద్భుతమైన రజత పతకం సాధించారు. 

 

ఆయన మరోసారి తన విశేషమైన స్థిరత్వం, సంయమనం, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు. ఆయన సాధించే విజయాలు ప్రతి భారతీయుడికి గర్వకారణం. భవిష్యత్తులో ఆయన సాధించబోయే విజయాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. #CWG202622’’

 

***