Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కామన్‌వెల్త్‌ మహిళల బాక్సింగ్ 57 కిలోల విభాగంలో స్వర్ణం సాధించిన జాస్మిన్ లాంబోరియాకు ప్రధానమంత్రి అభినందన


   గ్లాస్గో కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2026 మహిళల బాక్సింగ్‌ 57 కిలోల విభాగంలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న జాస్మిన్ లాంబోరియాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

బాక్సింగ్‌ క్రీడపై అంకితభావం, ప్రతిభా ప్రదర్శనలో స్థిరత్వం ఆమె సాధించిన ఈ విజయాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

భవిష్యత్తులోనూ ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ (ట్విట్టర్) ద్వారా పంపిన సందేశంలో:

“గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌ మహిళల బాక్సింగ్‌ 57 కిలోల విభాగంలో స్వర్ణపతక విజేత జాస్మిన్ లాంబోరియాకు అభినందనలు. ఈ విజయంలో ఆమె అంకితభావం, స్థిరత్వం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమెకు నా శుభాకాంక్షలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***