Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కామన్వెల్త్ గేమ్స్-2026 మహిళల 54 కేజీల బాక్సింగ్‌లో స్వర్ణం గెలిచిన ప్రీతిని అభినందించిన ప్రధానమంత్రి


కామన్వెల్త్ గేమ్స్‌2026 మహిళల 54 కేజీల బాక్సింగ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్న ప్రీతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

ప్రీతి నిలకడైన ఆటతీరుతో అద్భుత ప్రదర్శన కనబరుస్తోందని ప్రధానమంత్రి ప్రశంసించారు.

ఈ ఘనత సాధించిన సందర్భంగా ప్రీతిని అభినందించిన శ్రీ మోదీరాబోయే సంవత్సరాల్లో ఆమె మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

54 కేజీల మహిళల బాక్సింగ్ ఈవెంట్‌లో స్వర్ణం గెలుచుకున్న ప్రీతి అద్భుత ప్రదర్శన కనబరిచిందిఆమె ఆటతీరు నిలకడగా ఉందిఆమెకు అభినందనలుభవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా”.