Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పురుషుల 90+ కిలోల బాక్సింగ్ విభాగంలో రజత పతకం సాధించిన నరేందర్ బెర్వాల్‌ను అభినందించిన ప్రధానమంత్రి


గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 90+ కేజీల బాక్సింగ్ విభాగంలో రజత పతకం సాధించిన నరేందర్ బెర్వాల్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

పోటీలో ఆయన ప్రదర్శించిన అపారమైన ధైర్యం, దృఢ సంకల్పాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. నరేందర్ బెర్వాల్‌ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

“కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 90+ కేజీల బాక్సింగ్ విభాగంలో నరేందర్ బెర్వాల్ రజత పతకం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. పోటీలో అపారమైన ధైర్యాన్ని, పట్టుదలను ప్రదర్శించిన ఆయనకు నా అభినందనలు. భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు.