పిఎంఇండియా
మనిషి జీవితంలో వెలుగులు నింపి, ఆ మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఎనిమిది ప్రధాన గుణాలను వివరిస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ,
‘‘అష్టౌ గుణాః పురుషం దీపయన్తి ప్రజ్ఞా సుశీలత్వదమౌ శ్రుతం చ, పరాక్రమశ్చ బహుభాషితా చ దానం యథాశక్తి కృతజ్ఞతా చ’’ అనే శ్లోకాన్ని పేర్కొన్నారు.
శ్లోకంలో ప్రస్తావించిన ఎనిమిది గుణాలూ వ్యక్తి జీవితాన్ని ప్రకాశవంతం చేస్తాయి. ఏ వ్యక్తికైనా సరే, బుద్ధి సరైన దారిని చూపుతుంది. సత్ప్రవర్తన వ్యక్తి శీలాన్ని స్వచ్ఛంగా ఉంచుతుంది. ఆత్మనిగ్రహం క్రమశిక్షణని అలవరుస్తుంది. జ్ఞానం అవగాహనాశక్తిని అందిస్తుంది. పరాక్రమం కఠిన పరిస్థితులు ఎదురైనా దృఢంగా ఉండటంలో తోడ్పడుతుంది. నేర్పుగా మాట్లాడడం సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. యథాశక్తి దానమివ్వడం, కరుణను చూపిన వారి పట్ల కృతజ్ఞతను తెలియజేయడం.. ఇవి మనిషికి పూర్ణత్వాన్ని ఇస్తాయి.
***
अष्टौ गुणाः पुरुषं दीपयन्ति प्रज्ञा सुशीलत्वदमौ श्रुतं च।
— Narendra Modi (@narendramodi) August 11, 2026
पराक्रमश्च बहुभाषिता च दानं यथाशक्ति कृतज्ञता च।। pic.twitter.com/eb4INYRSkV