పిఎంఇండియా
భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ “ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్స్” శీర్షికతో ఉన్న పుస్తకాన్ని ఆగస్టు 12, 2026న ఉదయం 9:30 గంటలకు న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు.
భారత్‌లోని విశిష్టమైన ప్రముఖుల్లో ఒకరి జీవితాన్ని, దేశానికి ఆయన అందించిన సేవలను వేడుకగా జరుపుకునే ప్రత్యేక కార్యక్రమమే ఈ పుస్తకావిష్కరణ. మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ అసాధారణ జీవిత ప్రయాణాన్ని ఈ ఆత్మకథ వివరిస్తుంది. బాల్యంలోని రోజులను, ఆయన ఎదుర్కొన్న సవాళ్లను, సాధించిన విజయాలను, ప్రజా జీవితాన్ని, దేశ 14వ రాష్ట్రపతిగా అందించిన సేవలను ఈ పుస్తకం తెలియజేస్తుంది. ఆయన ప్రయాణం, ప్రజాసేవను తీర్చిదిద్దిన నైతిక విలువలు, అనుభవాలు, పరిస్థితులను వివరిస్తుంది.
***