పిఎంఇండియా
ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మార్కెట్‌ప్లేస్ (జీఈఎమ్) వేదిక ఇప్పటి వరకు సాధించిన విజయాలను సమగ్రంగా వివరిస్తూ కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ రాసిన వ్యాసాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. పారదర్శక కొనుగోళ్లు, విస్తృత భాగస్వామ్యం, మెరుగైన అవకాశాలను మంత్రి తన వ్యాసంలో ప్రస్తావిస్తూ, ప్రభుత్వ కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి మార్పులను జీఈఎమ్ తీసుకువస్తోందో తెలియజేశారు.
సాంకేతికతను వినియోగించుకోవడానికి జీఈఎమ్ వేదిక గత 10 సంవత్సరాలుగా ప్రాధాన్యాన్ని ఇస్తూ మరింత ఎక్కువ పోటీపడగలిగే, సమ్మిళత విస్తారిత అనుబంధ వ్యవస్థను ఆవిష్కరించి వాణిజ్య సౌలభ్యాన్ని బలోపేతం చేసిందని ప్రధానమంత్రి అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకూ, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు జీఈఎమ్ సాధికారతను కల్పిస్తోందని ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘పారదర్శక కొనుగోళ్లు, విస్తృత భాగస్వామ్యంతో పాటు మెరుగైన అవకాశాలు.. ఈ విధంగా ప్రభుత్వ కొనుగోళ్ల ప్రక్రియలో @GeM_India మార్పుచేర్పులను తీసుకువస్తోంది.
సాంకేతికతకు ప్రాధాన్యాన్ని ఇస్తూ, గత పది సంవత్సరాల్లో మరింత ఎక్కువగా పోటీపడగలుగుతున్న, సమ్మిళిత విస్తారిత అనుబంధ వ్యవస్థను జీఈఎమ్ వేదిక ఆవిష్కరించి వాణిజ్య సౌలభ్యాన్ని పెంపొందించింది. ఎమ్ఎస్ఎమ్ఈలకూ, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకూ సాధికారతను కల్పిస్తోంది.
ఇప్పటి వరకూ సాధించిన విజయాల్ని సమగ్రంగా వివరిస్తూ కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ రాసిన వ్యాసాన్ని చదవగలరు’’ అని పేర్కొన్నారు.
***
Transparent procurement, wider participation and better opportunities... This is how @GeM_India is transforming public procurement.
— PMO India (@PMOIndia) August 11, 2026
With technology at its core, the GeM platform has strengthened Ease of Doing Business over the last 10 years by creating a more competitive and… https://t.co/Z9rQLnGUXp