Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చూపు, ఆలోచనలు, మాటలు, చేతలతో మనసులను గెలవవచ్చు! ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


దృష్టి, ఆలోచనలు, మాటలు, చేతలతో ఇతరుల మనసులను గెలుచుకోవచ్చని సూచిస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ

‘‘మన యువ సహచరులు దేశానికి భవిష్యత్తు మాత్రమే కాదు, వర్తమానంలో అతి పెద్ద శక్తి కూడా వారే. తమ సంవేదనశీలత, సేవాభావం, సామర్థ్యంతో వారు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

“చక్షుషా మనసా వాచా కర్మణా చ చతుర్విధమ్

ప్రసాదయతి యో లోకం తం లోకోనుప్రసీదతి’’ అని పేర్కొన్నారు.

చూపు, ఆలోచనలు, మాటలు, చేతలతో ప్రజల మనసులను గెలుచుకొనే వ్యక్తి అందుకు ప్రతిఫలంగా వారి విశ్వాసం, ఆదరణ, సద్భావనను సంపాదించుకుంటాడని పైన ప్రస్తావించిన శ్లోకం మనకు బోధిస్తోంది.

 

***