Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత్‌ 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ దేశాల నేతలకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు


భారత్‌ 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాల నేతలు తెలిపిన హృదయపూర్వక శుభాకాంక్షలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.  ప్రపంచవ్యాప్తంగా అందిన అభినందన సందేశాల పట్ల ఆయన హర్షం, కృతజ్ఞతాభావం వ్యక్తం చేశారు.

భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్‌గే శుభాకాంక్షలకు ప్రధానమంత్రి స్పందిస్తూ,  “మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలు. భూటాన్‌తో మాకున్న ప్రత్యేకమైన, చిరకాల భాగస్వామ్యాన్ని మేము ఎంతో విలువైనదిగా భావిస్తున్నాం. ఈ బంధం రోజురోజుకూ మరింత బలోపేతమవుతోంది” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘  లో పేర్కొన్నారు. 

స్లోవేకియా అధ్యక్షుడు పీటర్‌ పెల్లెగ్రిని తెలిపిన శుభాకాంక్షలకు ప్రధానమంత్రి స్పందిస్తూ, “మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలు. భారత్‌, స్లోవేకియా మధ్య సమగ్ర భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షిస్తున్నాం” అని ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు. 

మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్‌ మహ్మద్‌ ముయిజ్జు తెలిపిన శుభాకాంక్షలకు శ్రీ మోదీ స్పందిస్తూ, “మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలు. భారత్‌, మాల్దీవుల మధ్య స్నేహ బంధాలు మరింత బలోపేతం కావాలని మా ఆకాంక్ష” అని ట్వీట్ చేశారు.  

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ తెలిపిన శుభాకాంక్షలకు స్పందిస్తూ, “ మిత్రుడు మాక్రాన్‌.. మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలు!” అని శ్రీ మోదీ ట్వీట్ చేశారు. 

నేపాల్‌ ప్రధానమంత్రి బాలేంద్ర షా తెలిపిన శుభాకాంక్షలకు శ్రీమోదీ సమాధానమిస్తూ, “మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలు. భారత్‌, నేపాల్‌ మధ్య ఉన్న బహుముఖ, శతాబ్దాల నాటి నాగరికతా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం. ఇరు దేశాల ప్రజల పరస్పర శ్రేయస్సు, సౌభాగ్యం కోసం కలిసి పనిచేస్తాం” అని పేర్కొన్నారు. 

నేపాల్‌కు చెందిన రబీ లామిచానే  తెలిపిన శుభాకాంక్షలకు ప్రధానమంత్రి స్పందిస్తూ, “మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు  ధన్యవాదాలు. భారత్‌,నేపాల్‌ మధ్య ఉన్న స్నేహబంధాలను మరింత బలోపేతం చేసేందుకు మేము కట్టుబడి ఉన్నాం. ఇరు దేశాల పరస్పర ప్రగతి, సౌభాగ్యం కోసం ఈ బంధాలను మరింత పటిష్టం చేస్తాం” అని పేర్కొన్నారు. 

 

***