Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పేయి పుణ్యతిథి సందర్భంగా నివాళులర్పించిన ప్రధానమంత్రి


మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి పుణ్యతిథి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు నివాళులర్పించారుఅద్భుతమైన దార్శనికతతో దేశ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన అసాధారణ రాజనీతిజ్ఞుడని ప్రధానమంత్రి స్మరించుకున్నారు.

అటల్ జీ మాటలుఆయన చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తూ ఉంటాయన్నారుఅటల్ జీ నాయకత్వం మన దేశాన్ని బలోపేతం చేసిందని ప్రధానమంత్రి పేర్కొన్నారుసుపరిపాలనప్రజా సంక్షేమంపై ఆయనకున్న దృష్టి మనకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

ఎక్స్’ వేదికగాఒక పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

అటల్ జీ పుణ్యతిథి సందర్భంగా వారిని స్మరించుకుందాంఆయన అద్భుతమైన దార్శనికత కలిగిన ఒక అసాధారణ రాజనీతిజ్ఞుడుతన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేశారుఆయన మాటలుకృషి తరతరాలకు స్ఫూర్తినిస్తూ ఉంటాయిఅటల్ జీ నాయకత్వం మన దేశాన్ని బలోపేతం చేసిందిసుపరిపాలనప్రజా సంక్షేమంపై ఆయనకున్న శ్రద్ధ మనకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తుంది.

 

***