Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు


   మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇది ప్రజల మధ్య ఐక్యతా స్ఫూర్తిని మరింత పటిష్టం చేస్తూ, ప్రపంచం నలువైపులా ఆనందాన్ని పంచే పర్వదినమని ఈ సందర్భంగా శ్రీ మోదీ అభివర్ణించారు. కరుణ, సమాజ సేవా కర్తవ్య స్ఫూర్తి ప్రతిఒక్కరికీ సదా మార్గదర్శకం చేయాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఈద్‌ ముబారక్‌!

మిలాద్‌-ఉన్‌-నబీ, ఇది మనందరిలో ఐకమత్యం పెంచి, ప్రపంచం నలుదిశలా ఆనందాన్ని పంచే పర్వదినం. ఈ కరుణా స్ఫూర్తి, సమాజ సేవా నిరతి మనకు సదా మార్గనిర్దేశం చేయాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.