పిఎంఇండియా
నిజమైన వివేకం గల వ్యక్తి గుణాలను చాటిచెబుతున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రస్తావించారు.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘యస్య కృత్యం న జానన్తి మన్త్రం వా మన్త్రితం పరే
కృతమేవాస్య జానన్తి స వై పండిత ఉచ్యతే’’ అని పేర్కొన్నారు.
ఒక వ్యక్తి తన ప్రణాళికలను, పనులను.. అవి విజయవంతంగా పూర్తి అయ్యే వరకు.. పరులకు తెలియజేయకుండా గోప్యంగా ఉంచినప్పుడు, అలాంటి వ్యక్తిని నిజమైన పండితుడని అనవచ్చు. ఇలాంటి క్రమశిక్షణ, సూక్ష్మ పరిశీలన శక్తి కలిగిన, ఆలోచనాపరుడిని నిజమైన వివేకిగా గౌరవిస్తారని ఈ సుభాషితం చెబుతోంది.
यस्य कृत्यं न जानन्ति मन्त्रं वा मन्त्रितं परे।
— Narendra Modi (@narendramodi) September 1, 2026
कृतमेवास्य जानन्ति स वै पण्डित उच्यते॥ pic.twitter.com/rpM8ZG5DKG