Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కౌశాంబిలో టపాసుల కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధాని సంతాపం ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియాను ప్రకటించిన పీఎం


ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబిలో టపాసుల కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో సంభవించిన ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియాను శ్రీ మోదీ ప్రకటించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:

ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబిలో ఉన్న టపాసుల కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో సంభవించిన ప్రాణనష్టం తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.

మృతుల కుటుంబాలకు పీఎంఎన్‌ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను, గాయపడిన వారికి రూ.50,000 పరిహారాన్ని అందజేస్తాం. 

 

***