Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బెల్జియం ప్రధాని భారత పర్యటన సందర్భంగా భారత్ – బెల్జియం సంయుక్త ప్రకటన

బెల్జియం ప్రధాని భారత పర్యటన సందర్భంగా భారత్ – బెల్జియం సంయుక్త ప్రకటన


భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు.. 2026 సెప్టెంబరు నుంచి వరకు బెల్జియం ప్రధానమంత్రి శ్రీ బార్ట్ డి వెవర్ భారత్‌లో పర్యటిస్తున్నారుఆ దేశ రక్షణవిదేశీ వాణిజ్య శాఖ మంత్రి శ్రీ థియో ఫ్రాంకెన్అధికారులతోపాటు వ్యాపారవేత్తలతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఆయన వెంట ఉన్నాయి. 2025 ఫిబ్రవరిలో పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం.. బెల్జియం ప్రధానమంత్రి డి వెవర్ భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి.

రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళి ఘటించి.. బెల్జియం ప్రధానమంత్రి డి వెవర్ తన పర్యటనను ప్రారంభించారుఅనంతరం మొదట భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో పరిమిత స్థాయి సమావేశంలోనూఅనంతరం ఇరుదేశాల ప్రతినిధి బృందాల స్థాయిలోనూ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారుఇరుదేశాల మధ్య సంబంధాల విషయంలో దాదాపు అన్ని అంశాలూ వారి మధ్య చర్చకు వచ్చాయిబెల్జియం ప్రధానమంత్రి డి వెవర్ఆ దేశ ప్రతినిధి బృందానికి.. ప్రధానమంత్రి శ్రీ మోదీ ఆతిథ్యాన్ని అందించారు.

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఫ్లాండర్స్ ఫీల్డ్స్‌లో ప్రాణాలర్పించిన 9,000 మందికి పైగా భారత సైనికుల త్యాగాలను ప్రధానులిద్దరూ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. 1947లో భారత్‌తో దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్న మొదటి ఐరోపా దేశాల్లో బెల్జియం ఒకటిగా ఉన్న విషయాన్ని గుర్తుచేసుకున్నారుఉమ్మడి ప్రజాస్వామ్య విలువలుపరస్పర విశ్వాసంఆర్థిక భాగస్వామ్యంబలమైన ప్రజా సంబంధాలు పునాదులుగా.. ఈ భాగస్వామ్యం నాటి నుంచే సుసంపన్నమైందని వారు పేర్కొన్నారుఈ బహుముఖ సంబంధాలను మరింత విస్తరించిబలోపేతం చేసుకోవాలని ప్రధానమంత్రులిద్దరూ ఆకాంక్షించారు. 2027 నాటికి భారత్ – బెల్జియం దౌత్య సంబంధాలు 80 ఏళ్లు పూర్తవుతున్నాయనిద్వైపాక్షిక సంబంధాల విస్తరణకు ఇదొక చరిత్రాత్మక అవకాశమని అన్నారు.

2026 జూలై 15న బ్రస్సెల్స్‌లో భారత విదేశాంగ శాఖ మంత్రి – బెల్జియం ఉప ప్రధానివిదేశాంగ మంత్రి సంయుక్త అధ్యక్షతన ప్రారంభమైన మొదటి ‘భారత్ – బెల్జియం వ్యూహాత్మక చర్చల’ను ప్రధానమంత్రులిద్దరూ స్వాగతించారువిస్తృతమైన భారత్ఐరోపా యూనియన్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా.. వాణిజ్యంపెట్టుబడులుపర్యావరణ హిత పరివర్తనసాంకేతికతరవాణారక్షణభద్రతప్రజా సంబంధాల్లో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లేలా ఒక క్రమబద్ధమైనసమగ్ర వ్యవస్థను ఈ చర్చలు నెలకొల్పాయని వారు పేర్కొన్నారుఈ నేపథ్యంలోవ్యూహాత్మక చర్చల్లో గుర్తించిన ప్రాధాన్యాలను వేగవంతం చేసే కీలక వేదికగా.. త్వరలో నిర్వహించనున్న విదేశాంగ శాఖ సంప్రదింపులను వారు స్వాగతించారు.

ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న అత్యవసర సవాళ్లను పరిష్కరించడంతోపాటుసాంకేతికఆర్థిక రంగాల్లో నూతన పరిణామాలకు ప్రపంచాన్ని సిద్ధం చేసేలా – సమానమైనశాంతియుతమైన అంతర్జాతీయ క్రమాన్ని నెలకొల్పే దిశగా.. ఐక్యరాజ్యసమితి (యుఎన్చార్టర్ కేంద్రంగా.. సంస్కరించినసమర్థమైన బహుపాక్షిక భాగస్వామ్య వ్యవస్థ అవసరమన్న తమ వాదనను ప్రధానమంత్రులిద్దరూ పునరుద్ఘాటించారునేటి ప్రపంచ పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని తక్షణమే సంస్కరించాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేశారుసంస్కరించినవిస్తరించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ అభ్యర్థిత్వానికి బెల్జియం మద్దతును పునరుద్ఘాటించిందిఅలాగే భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వానికి పరస్పర మద్దతు విషయంలో (2028-29 కాలానికి భారత్‌, 2037-38 కాలానికి బెల్జియంఇరుదేశాలు అంగీకారానికి వచ్చాయి.

భారత్ – ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యంస్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

భారత్ – బెల్జియం సంబంధాల్లో.. ‘భారత్ఐరోపా యూనియన్ వ్యూహాత్మక భాగస్వామ్యం’ అత్యంత కీలకమైనదని ప్రధానమంత్రులిద్దరూ పునరుద్ఘాటించారు. 2026 జనవరి 27న నిర్వహించిన భారత్ – ఈయూ సదస్సులో.. భారత్ – ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలు విజయవంతం కావడాన్ని వారు స్వాగతించారుఅలాగే భారత్ – ఐరోపా యూనియన్ల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే లక్ష్యంతో.. ‘ఈయూభారత్ పెట్టుబడుల పరిరక్షణ ఒప్పందం’, ‘భౌగోళిక గుర్తింపుల ఒప్పందా’లపై చర్చలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.

వ్యూహాత్మక భాగస్వామ్యంలో చరిత్రాత్మక మైలురాయిగా భారత్ – ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వారిద్దరూ వ్యాఖ్యానించారుఈ ఒప్పందాన్ని సకాలంలో అమలు చేయాలని పిలుపునిచ్చారుతద్వారా కీలకమైన ప్రతి దశలోనూ మరింత విస్తరిస్తూకొత్త మార్కెట్లను అందుబాటులోకి తెస్తూ.. వాణిజ్యంపెట్టుబడి సహకారంలో పూర్తిస్థాయి సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు.

వాణిజ్యం – సాంకేతికత రెండూ రోజు రోజుకూ విడదీయలేని విధంగా ముడిపడిపోతున్న నేటి తరుణంలో.. మరింత సమీకృతపటిష్టమైనసుస్థిర ఆర్థికసాంకేతిక భాగస్వామ్యాన్ని నిర్మించే దిశగా ‘భారత్ – ఈయూ వాణిజ్యసాంకేతిక మండలి’ సాధిస్తున్న విశేష పురోగతిని, 2026 జూలైలో బ్రస్సెల్స్‌లో నిర్వహించిన మంత్రివర్గ స్థాయి సమావేశాన్ని ప్రధానమంత్రులిద్దరూ స్వాగతించారుఈ నేపథ్యంలో వాణిజ్యంసాంకేతికతఆర్థిక భద్రతపటిష్టమైన సరఫరా వ్యవస్థల విషయంలో భారత్బెల్జియంఐరోపా సమాఖ్యల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్టు పునరుద్ఘాటించారు.

భారత్ – ఈయూ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంబలోపేతం చేయడం ద్వారా.. రెండు పక్షాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా పరస్పర ప్రయోజనకరమైనస్పష్టమైనవిప్లవాత్మకమైన ఫలితాలను అందించే ‘సంయుక్త భారత్ – ఈయూ సమగ్ర వ్యూహాత్మక ఎజెండా – 2030’ని ఇరుపక్షాలు ఆమోదించాయిఅలాగే సముద్ర భద్రతరక్షణ పరిశ్రమసాంకేతికతసైబర్ – హైబ్రిడ్ ముప్పుఅంతరిక్షంఉగ్రవాద నిరోధక రంగాలు సహా ఉమ్మడి ప్రయోజనాలున్న కీలక అంశాల్లో వ్యూహాత్మక సహకారాన్ని.. ‘భారత్ – ఈయూ భద్రతరక్షణ భాగస్వామ్యం’ బలోపేతం చేస్తుందని వారు పేర్కొన్నారు.

వాణిజ్యంఆర్థిక సహకారంపెట్టుబడులు

ప్రపంచంలో 24వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా బెల్జియంత్వరలోనే 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న ఆకాంక్షతో భారత్ ఉన్న నేపథ్యంలో.. ఇరుదేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యాలకు పుష్కలంగా అవకాశాలున్నాయని ప్రధానమంత్రులిద్దరూ అంగీకరించారురెండు ఆర్థిక వ్యవస్థల మధ్య ఉన్న బలమైన అనుకూలతలను గుర్తించిన వారు.. వాణిజ్యంపెట్టుబడులుఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారుఈ క్రమంలో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు స్థిరంగా విస్తరించడంద్వైపాక్షిక వాణిజ్య రంగాలు విస్తరిస్తుండడాన్ని వారు స్వాగతించారువచ్చే అయిదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెండింతలు చేసుకునే లక్ష్యంతో.. ఉమ్మడి ప్రయోజనాలున్న కీలక రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు.

బెల్జియం యువరాణి ఆస్ట్రిడ్ నేతృత్వంలో 2025 మార్చిలో భారత్‌లో ‘బెల్జియం ఆర్థిక బృందం’ పర్యటన విజయవంతం కావడంపై ప్రధానమంత్రులిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారుద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంలోనూవ్యాపార సంస్థలువ్యవస్థల మధ్య కొత్త భాగస్వామ్యాలను నెలకొల్పడంలోనూ ఈ పర్యటన కీలక మైలురాయిగా నిలిచిందని వ్యాఖ్యానించారుమహిళల ఆర్థిక సాధికారతపై చర్చలు కూడా ఇందులో భాగంగా ఉన్నాయన్నారుఅంతేకాకుండా లైఫ్ సైన్సుఔషధంఆరోగ్య రక్షణఇంధనంపునరుత్పాదక ఇంధనంరక్షణవిమానయాన – అంతరిక్ష రంగంలాజిస్టిక్స్రవాణాఓడరేవులుక్లీన్‌టెక్ – గ్రీన్ ఇంజినీరింగ్కెమిస్ట్రీఅధునాతన పరికరాలుతయారీ రంగండిజిటల్ సాంకేతికతలుఆవిష్కరణల వంటి ప్రాధాన్యతా రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవడంలోనూ ఈ పర్యటన దోహదపడిందని పేర్కొన్నారుముఖ్యంగా ఔషధాలుబయోటెక్నాలజీచికిత్సాపరమైన పరిశోధనఆవిష్కరణఅధునాతన ఆరోగ్య సంరక్షణ విధానాల్లో ఇరుదేశాల బలాలు పరస్పర పూరకాలుగా ఉన్నాయనీఈ క్రమంలో లైఫ్ సైన్సుల రంగంలో భారత్బెల్జియం భాగస్వామ్యానికి అపారమైన అవకాశాలు ఉన్నాయనీ వారు వెల్లడించారుఈ దిశగా పరిశ్రమలువిద్యా సంస్థలుపరిశోధన సంస్థల మధ్య మరింత సన్నిహిత సహకారం ఉండాలని ఆకాంక్షించారుబెల్జియం ప్రాంతీయ వాణిజ్యపెట్టుబడి సంస్థలు సహా.. నిరంతర ఉన్నత స్థాయి చర్చల ద్వారా ఈ భాగస్వామ్యంలో పురోగతిని ఇలాగే కొనసాగించాలని ప్రధానమంత్రులిద్దరూ అంగీకారానికి వచ్చారు.

సెమీకండక్టర్లురసాయనాలుఔషధ రంగంరక్షణ రంగ పారిశ్రామిక సహకారంకీలక ఖనిజాల శుద్ధి – పునర్వినియోగంసుస్థిర పరిశ్రమలుఅణు ఇంధనం వంటి రంగాల్లో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు పెంపొందుతుండడంసహకారం విస్తరిస్తుండడాన్ని వారు స్వాగతించారుప్రైవేటు రంగానికి భాగస్వామ్యం కల్పిస్తూ.. సరికొత్త రంగాల్లో సహకారం కోసం అవకాశాల అన్వేషణపై కూడా చర్చించారుముంబయిసూరత్‌లతో.. ఆంట్వర్ప్ నగరాన్ని అనుసంధానించే వజ్రాల వాణిజ్యానికి ఎనలేని ప్రాధాన్యం ఉందన్నారుకొత్త ఆర్థిక అవకాశాలనూఉమ్మడి పురోగతినీ వేగవంతం చేస్తూ.. ఈ చరిత్రాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై ప్రధానమంత్రులిద్దరూ అంగీకారానికి వచ్చారు.

నౌకా వాణిజ్యంఓడరేవులపరంగా ఇరుదేశాల మధ్య సహకారానికి ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని వారిద్దరూ స్పష్టం చేశారుఓడరేవుల అభివృద్ధివస్తు రవాణాఅనుసంధానంపూడికతీతతీరప్రాంత పవన శక్తి మౌలిక సదుపాయాల రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశాలను స్వాగతించారుఈ నేపథ్యంలో 2026 అక్టోబరులో న్యూఢిల్లీలో నిర్వహించతలపెట్టిన ‘సాగర్‌మంథన్మహాసముద్ర చర్చ’ కార్యక్రమంలో ఫ్లెమిష్ రవాణాఓడరేవుల శాఖ మంత్రి అనిక్ డి రిడర్ పాల్గొంటుండడాన్ని ఇరుపక్షాల నేతలు స్వాగతించారుఅలాగే ఏపీఈసీ (ఆంట్వర్ప్ఫ్లాండర్స్ ఓడరేవు శిక్షణ కేంద్రం), భారత్‌కు చెందిన జవహర్‌లాల్ నెహ్రూ ఓడరేవుల ప్రాధికార సంస్థ (జేఎన్‌పీఏమధ్య విస్తృత సహకారానికి గల అవకాశాలను వారు స్వాగతించారుముఖ్యంగా భారతీయ ఓడరేవుల రంగానికివిస్తృతమైన నౌకా వాణిజ్య రంగానికి చెందిన అన్ని స్థాయుల అధికారులుఉద్యోగుల శిక్షణ అవసరాలను గుర్తించడంవారి సామర్థ్యాలను పెంపొందించడం వంటి అంశాల్లో ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారుభారత ఓడరేవు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో.. బెల్జియం తన డ్రెడ్జింగ్ నైపుణ్యాలతో అందిస్తూ వస్తున్న తోడ్పాటునూతీరప్రాంత పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఊతమివ్వడంలో దాని సామర్థ్యాన్నీ చర్చించారు.

‘బెల్గో – ఇండియన్ ఖగోళశాస్త్రఖగోళ భౌతిక శాస్త్ర నెట్‌వర్క్ (బీఐఎన్ఏ)’ ద్వారా.. ఖగోళ శాస్త్రంఖగోళ భౌతికశాస్త్రంఅంతరిక్ష సాంకేతికతలల్లో పరిశోధనఉన్నత విద్యలో ఇరుదేశాల మధ్య సహకారం విస్తరించడాన్ని ప్రధానమంత్రులిద్దరూ స్వాగతించారుదేవస్థల్ ఆప్టికల్ టెలిస్కోప్దేవస్థల్ అంతర్జాతీయ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్మౌంట్ అబు టెలిస్కోప్ఉదయ్‌పూర్‌లోని బహుళ అనువర్తన సౌర టెలిస్కోప్ సహా.. పలు చరిత్రాత్మక ఖగోళ పరిశోధన కేంద్రాల ఏర్పాటులో బెల్జియం తోడ్పాటును ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకున్నారుఇది ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వైజ్ఞానిక సహకార శక్తికి ఇది నిదర్శనమన్నారు.

‘భారత్బెల్జియం వేగవంతమైన పెట్టుబడి ఆమోద ప్రక్రియ’ ప్రారంభాన్ని వారిద్దరూ స్వాగతించారుద్వైపాక్షిక పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా కీలక ముందడుగుగా దీనిని స్వాగతించారుభారత్‌లో బెల్జియం పెట్టుబడులనూబెల్జియంలో భారతీయ పెట్టుబడులనూ సులభతరం చేయడంతోపాటు మరింత విస్తరించడానికి ఒక ప్రత్యేక వేదికగా ఈ ప్రతిపాదిత వ్యవస్థ ఉపయోగపడుతుందని పేర్కొన్నారువ్యాపార సంస్థలకు సహకారాన్ని అందించడంపెట్టుబడుల్లో అవరోధాలను తొలగించడంఇరుదేశాల మధ్య సుదీర్ఘకాల ఆర్థిక సహకారం కోసం అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించడంలో ఇదెంతగానో ఉపయోగపడుతుందని వారు అభిప్రాయపడ్డారు.

బెల్జియం అత్యున్నత వెల్త్ ఫండ్ అయిన ఫెడరల్ హోల్డింగ్ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ (ఎస్ఎఫ్‌పీఐఎం) – భారత జాతీయ పెట్టుబడిమౌలిక సదుపాయాల నిధి (ఎన్ఐఐఎఫ్మధ్య సంప్రదింపులను కూడా వారు స్వాగతించారుఆ రెండు సంస్థల మధ్య సహకారాన్ని క్రమబద్ధీకరించి.. ఇండో– బెల్జియన్ ఆర్థికపెట్టుబడి కారిడార్‌ను ఏర్పాటు చేయడంపై చర్చించారుబెల్జియంకు చెందిన అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం పెట్టుబడి సంస్థ (బీఐవో ఇన్వెస్ట్సహకారాన్ని కూడా వారు స్వాగతించారుపరస్పర ప్రయోజనాలున్న రంగాల్లో.. బీఐవో ఇన్వెస్ట్ – ఎన్ఐఐఎఫ్ మధ్య సహకారానికి అవకాశమున్న రంగాలను పరిశీలించడంపై అంగీకారానికి వచ్చారు.

ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడంలో.. భారత్ – బెల్జియం – లగ్జెంబర్గ్ ఆర్థిక యూనియన్ (బీఎల్ఈయూసంయుక్త ఆర్థిక కమిషన్ ఒక కీలక యంత్రాంగంగా ఉంటుందని ప్రధానమంత్రులిద్దరూ స్పష్టం చేశారుఈ ఏడాది చివర్లో నిర్వహించనున్న బీఎల్ఈయూ 19వ సమావేశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు

రక్షణభద్రతా సహకారం

సరిహద్దు ఉగ్రవాదం సహా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వెవర్ భారత్‌కు పూర్తి సంఘీభావం తెలిపారు. 2025 ఏప్రిల్ నెలలో భారత్‌లోని జమ్మూ కాశ్మీర్‌లో గల పహల్గామ్‌లో అమాయక పౌరులపై జరిగిన ఉగ్రదాడిని ఆయన మరోసారి ఖండించారుఉగ్రవాద నిరోధానికి సమగ్రమైనప్రపంచవ్యాప్త విధానానికి తాము కట్టుబడి ఉన్నామని ఇరువురు నేతలు స్పష్టం చేశారుఉగ్రవాదం ఏ రూపంలోఏ రీతిలోఎక్కడ కొనసాగుటనూ తాము ఎన్నటికీ సమర్థించలేమని వారు పునరుద్ఘాటించారుఉగ్రవాద చర్యలకు పాల్పడేవారిని అంతర్జాతీయ చట్టాల ప్రకారం జవాబుదారీగా చేయాలని వారు పిలుపునిచ్చారుఉగ్రవాదులుఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా… ఉగ్రవాద నెట్‌వర్క్‌లువాటి సురక్షిత స్థావరాలువాటికి అందే ఆర్థిక సహాయానికి వ్యతిరేకంగా… ఐక్యరాజ్యసమితిఎఫ్ఏటీఎఫ్ సహా అంతర్జాతీయ సమాజమంతా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరముందని వారు అంగీకరించారుజాతీయప్రాంతీయఅంతర్జాతీయ స్థాయిల్లో ఆంక్షల విధింపు సహా… ఉగ్రవాదాన్ని నివారించడానికిఎదుర్కోవడానికి అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయాలని ఇరువురు నేతలు పిలుపునిచ్చారునానాటికీ పెరుగుతున్న ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడంలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతోఉగ్రవాదాన్ని నిరోధించడం కోసం బెల్జియంభారత్ సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను అన్వేషించాలనే తమ ఉద్దేశాన్ని ఇరువురు నేతలు వ్యక్తం చేశారు.

రక్షణ రంగ సహకారంలో భాగంగా ఇరు దేశాల రక్షణ మంత్రిత్వ శాఖలు లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సంతకాలు చేయడాన్ని ఇరువురు ప్రధానమంత్రులు స్వాగతించారుఇది నిరంతర చర్చలుసిబ్బంది స్థాయి చర్చలువిద్యశిక్షణపరిశోధన రంగాల్లో పరస్పర సహకారంరక్షణ రంగ పారిశ్రామిక భాగస్వామ్యాల కోసం ఒక విధాన ప్రణాళికను రూపొందిస్తుందిద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని సంస్థాగతం చేయడంమరింత బలోపేతం చేయడం లక్ష్యంగా 2025 మార్చిలో భారత్బెల్జియం రక్షణ మంత్రుల మధ్య కుదిరిన అవగాహనను ఈ ఒప్పందం మరింత ముందుకు తీసుకువెళ్తుందని వారు పేర్కొన్నారుసముద్ర భద్రతఅభివృద్ధి చెందుతున్న సాంకేతికతలువిద్యసైనిక సంబంధిత సహకారం సహా ఇండోపసిఫిక్‌లో సహకారం వంటి అంశాల్లో ఇరు దేశాల రక్షణ సంస్థల మధ్య సంబంధాలు క్రమంగా బలపడటాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు. 2026 నవంబర్ నుంచి 8వ తేదీ వరకు బెల్జియన్ ఫ్రిగేట్ లియోపోల్డ్ I’ భారత్ పర్యటన… బెల్జియన్ డిఫెన్స్ కాలేజ్ తన వరల్డ్ స్టడీ ట్రిప్ 2027′ను భారత్‌లో నిర్వహించాలనే ఉద్దేశం… కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్సికింద్రాబాద్ 2026 అక్టోబరులో బెల్జియంలో జరిపే అధ్యయన పర్యటన వంటి కార్యక్రమాలను వారు స్వాగతించారుఇరు దేశాల రక్షణ సంస్థల మధ్య పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసే స్పష్టమైన అవకాశాలుగా వాటిని అభివర్ణించారు.

న్యూఢిల్లీలో ఒక డిఫెన్స్ అటాచీని నియమించాలని బెల్జియం… సమీప భవిష్యత్తులో బ్రస్సెల్స్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఒక రెసిడెంట్ డిఫెన్స్ అటాచీని నియమించాలని భారత్ తీసుకున్న నిర్ణయాన్ని వారు స్వాగతించారుసముద్ర భద్రతఅభివృద్ధి చెందుతున్న సాంకేతికతలుఇండోపసిఫిక్‌లో సహకారం వంటి అంశాలపై ఇరు దేశాల రక్షణ సంస్థల మధ్య సంబంధాలు క్రమంగా బలపడటాన్నీ ఇరువురు నేతలు స్వాగతించారు.

భారత్బెల్జియంల మధ్య పెరుగుతున్న రక్షణపారిశ్రామిక సహకారాన్ని ఇరు దేశాల ప్రధానమంత్రులు స్వాగతించారు. 2025 మార్చిలో భారత్‌లో జరిగిన బెల్జియం ఆర్థిక మిషన్ సందర్భంగా ఇటువంటి భాగస్వామ్యాలు మరింత బలోపేతమయ్యాయని వారు పేర్కొన్నారురక్షణ తయారీసాంకేతికతఆవిష్కరణసహఅభివృద్ధిసహఉత్పత్తి రంగాల్లో మరింత సహకారానికి గల అవకాశాలను గుర్తించిన ఇరువురు నేతలు… బెల్జియంభారత్ రక్షణ పరిశ్రమల మధ్య కుదిరిన పలు ఒప్పందాలుభాగస్వామ్యాలను స్వాగతించారుఇరు దేశాల పరిశ్రమలు ఈ ప్రక్రియలో పూర్తిగా నిమగ్నమై ఉండాలని ప్రోత్సహించారు.

యిప్రెస్‌లోని ఫ్లాండర్స్ ఫీల్డ్స్ మ్యూజియంన్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ హిస్టారికల్ రీసెర్చ్ మధ్య కొనసాగుతున్న సహకారాన్నీ ఇరువురు నేతలు గుర్తించారుఈ సహకారం భారత్బెల్జియం ఉమ్మడి చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించడానికిప్రోత్సహించడానికి దోహదం చేస్తోందని వారు పేర్కొన్నారు.

అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలుసైబర్ నేరాలుసంబంధిత విషయాలపై పోరాటంలో సహకారం లక్ష్యంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఇండియాఫెడరల్ పోలీస్ ఆఫ్ బెల్జియం మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని ఇరువురు ప్రధానులు స్వాగతించారుఈ ఒప్పందం సంస్థాగత సంబంధాలను బలోపేతం చేస్తుందని… సమాచార భాగస్వామ్యాన్ని సులభతరం చేస్తుందని… సామర్థ్యాలను పెంపొందించడంఉత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవడాన్ని ప్రోత్సహిస్తుందని… పారిపోయిన వ్యక్తులను గుర్తించడంలో సహకారాన్ని పెంపొందిస్తుందని… అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలుసైబర్ నేరాలుసంబంధిత విషయాలను ఎదుర్కోవడం కోసం ద్వైపాక్షిక చట్టాల అమలులో సహకారాన్ని మరింత పెంపొందిస్తుందని వారు పేర్కొన్నారు.

హరిత పరివర్తనఅభివృద్ధి చెందుతున్న సాంకేతికతలుఆరోగ్య సంరక్షణలో సహకారంఅంకురసంస్థలు

భారత్బెల్జియంల మధ్య పునరుత్పాదక ఇంధన సహకారంపై అవగాహన ఒప్పంద పునరుద్ధరణను ఇరు దేశాల ప్రధానమంత్రులు స్వాగతించారు. 2015 విధాన ప్రణాళిక ద్వారా నెలకొల్పిన సహకారాన్నిపునరుత్పాదక ఇంధనంపై సంయుక్త కార్యాచరణ బృందం కృషిని ఈ అవగాహన ఒప్పందం పునరుద్ధరణ మరింత ముందుకు తీసుకువెళ్తుందని వారు అభిప్రాయపడ్డారుగ్రీన్ హైడ్రోజన్సౌరశక్తిఇంధన నిల్వఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీబయోఎనర్జీచిన్న జలవిద్యుత్పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు వంటి కీలక రంగాల్లో సహకారాన్ని ఇది విస్తరిస్తుందని వారు పేర్కొన్నారు.

పారిశ్రామిక భాగస్వామ్యాలువిజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడం సహా గ్రీన్ హైడ్రోజన్ రంగంలో భారత్బెల్జియంల మధ్య పెరుగుతున్న సహకారాన్ని ఇరు దేశాలూ స్వాగతించాయిజీహెచ్ఇండియాబెల్జియన్ హైడ్రోజన్ కౌన్సిల్ఫ్లాండర్స్ ఇన్వెస్ట్‌మెంట్ – ట్రేడ్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం కింద సహకారాన్ని వారు గుర్తించారుబ్రస్సెల్స్‌లోని ఎగ్మాంట్ ఇనిస్టిట్యూట్ గ్రీన్ హైడ్రోజన్ ఎక్స్‌చేంజ్ కార్యక్రమంలో భారత అధికారుల చురుకైన భాగస్వామ్యాన్ని… ఇరు దేశాల ప్రభుత్వపారిశ్రామికపరిశోధనా రంగాల ప్రతినిధుల పరస్పర పర్యటనలనూ వారు గుర్తించారుడీకార్బనైజేషన్‌ను ముందుకు తీసుకెళ్లడంఆవిష్కరణలను ప్రోత్సహించడంఇంధన భద్రతను పెంచడంసుస్థిర ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో… ఉత్పత్తిరవాణానిల్వతుది వినియోగ అనువర్తనాలు సహా గ్రీన్ హైడ్రోజన్ సంబంధిత వాణిజ్య కార్యకలాపాల బలోపేతంలో భారత్బెల్జియంల కీలక పాత్రను ఇరు దేశాల ప్రధానమంత్రులు ప్రముఖంగా ప్రస్తావించారు.

విభిన్న జాతీయ పరిస్థితుల దృష్ట్యాపారిస్ ఒప్పంద ఉష్ణోగ్రత లక్ష్యం సహా దాని దీర్ఘకాలిక లక్ష్యాలు… సమానత్వంవిభిన్నమైన ఉమ్మడి బాధ్యతలుసంబంధిత సామర్థ్యాలు సహా దాని సూత్రాల పట్ల భారత్బెల్జియం దేశాలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయిఅమలును ముందుకు తీసుకువెళ్లిక్షేత్రస్థాయిలో మెరుగైన చర్యలకు దారితీసే విజయవంతమైన సీఓపీ31కి ఇరు దేశాలు మద్దతునిస్తున్నాయిముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అన్ని వనరుల నుంచి తగినంతఅంచనా వేయగలఅందుబాటులో ఉండే వాతావరణ సంబంధిత నిధులను సమీకరించడం… వాతావరణ సాంకేతికతలను అభివృద్ధి చేయడంవ్యాప్తి చేయడం… సామర్థ్యాలను పెంపొందించుకోవడం ద్వారా మెరుగైన వాతావరణ చర్యలు సాధ్యమవుతాయని వారు గుర్తించారుఈ రంగాల్లో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతనూ వారు ప్రముఖంగా ప్రస్తావించారువాతావరణ అనుకూలతఅన్ని రకాల పరిస్థితులను ఎదుర్కోగల సామర్థ్యంవిపత్తు సంసిద్ధతను బలోపేతం చేయడానికి ఇరుపక్షాలు కట్టుబడి ఉన్నాయని తెలిపారువాతావరణ సవాళ్లను ఎదుర్కోవడంసుస్థిర అభివృద్ధితీరప్రాంత ప్రజల శ్రేయస్సుకు మద్దతునివ్వడంలో సముద్రాలుతీరప్రాంత పర్యావరణ వ్యవస్థల కీలక పాత్రను ఇరువురు నేతలు గుర్తించారుసుస్థిర అభివృద్ధిని సాధించడంవాతావరణ సవాళ్లను ఎదుర్కోవడంలో ఒక భాగంగా పటిష్ఠమైన సముద్ర నిర్వహణ ప్రాముఖ్యతనూ వారు గుర్తించారుజాతీయ అధికార పరిధికి అతీతమైన జీవవైవిధ్య (బీబీఎన్‌జేఒప్పందంనౌకా వాణిజ్య వ్యవహారాల్లో విస్తృత అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యతను ఇరు దేశాల నేతలు ప్రముఖంగా ప్రస్తావించారు.

సెమీకండక్టర్ కంపెనీలుచిప్‌ఇన్ సెంటర్సిడాక్విశ్వవిద్యాలయాలతో కూడిన భారతీయ మైక్రోఎలక్ట్రానిక్స్ వ్యవస్థ… బెల్జియంకు చెందిన ఐమెక్‌ల మధ్య పరస్పర సహకారాన్ని ఇరువురు నేతలు ప్రోత్సహించారుసెమీకండక్టర్ సాంకేతికతల్లో ఈ పరస్పర సహకారాన్ని మరింత లోతైన భాగస్వామ్యాలుగా అభివృద్ధి చేయడానికి తమ మద్దతును తెలిపారుతద్వారా ఇరు దేశాల్లో పటిష్ఠమైనఅధునాతన సాంకేతిక వ్యవస్థల ఏర్పాటుకు సహకారం అందిస్తామని వారు పేర్కొన్నారు.

భారత్ ఆతిథ్యం ఇచ్చిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఫ్లాండర్స్ ప్రభుత్వ మంత్రిఅధ్యక్షులు పాల్గొనడాన్ని ఇరువురు నేతలు స్వాగతించారుకృత్రిమ మేధఅభివృద్ధి చెందుతున్న సాంకేతికతలుఆవిష్కరణల్లో పెరుగుతున్న సహకార ప్రాముఖ్యతను ఈ పర్యటన స్పష్టం చేసిందని వారు పేర్కొన్నారు.

స్టార్టప్ ఇంక్యుబేషన్ రంగాల్లో సహకారాన్ని ఇరుపక్షాలూ స్వాగతించాయిఈ విషయంగాఆవిష్కరణఆధారిత వ్యవస్థాపనకు మద్దతునివ్వడం… డిజిటల్ నైపుణ్యాల అభివృద్ధిని మెరుగుపరచడం ద్వారా అంకురసంస్థల వ్యవస్థలను మెరుగుపరచడం కోసం ఎమ్ఈఐటీవై స్టార్టప్ హబ్హబ్ బ్రస్సెల్స్‌తో పాటు ఇతర స్టార్టప్ హబ్‌లునైపుణ్య కేంద్రాల మధ్య సహకారాన్ని కొనసాగించడానికి ఇరు దేశాల ప్రధానమంత్రులు అంగీకరించారు.

అనుసంధానంరవాణావిద్యసంస్కృతిప్రజా సంబంధాలు

సమర్థమైన వీసా సేవల ద్వారా ప్రజా సంబంధాలనూఅనుసంధానాన్నీ బలోపేతం చేయాల్సిన ప్రాధాన్యాన్ని ఇద్దరు నాయకులు గుర్తించారుఈ దిశగా వీసాల జారీ ప్రక్రియ సజావుగావేగంగా జరగాల్సిన అవసరాన్ని కూడా వారు గుర్తించారుభారత్బెల్జియం దేశాల మధ్య రాకపోకలు పెరుగుతున్న నేపథ్యంలో రెండు దేశాల్లోని దౌత్య కార్యాలయాల్లో వీసాల జారీ సామర్థ్యం గణనీయంగా వృద్ధి చెందుతోందిఈ నిర్దుష్ట అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని భారత్‌లో బెల్జియం వీసా సేవలను మెరుగుపరుస్తుండటాన్ని ఇద్దరు నాయకులు స్వాగతించారు.

రవాణాపై సమగ్ర సహకార ముసాయిదాపై ఈయూతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడాన్నీభారత్‌లో ప్రయోగాత్మకంగా యూరోపియన్ యూనియన్ లీగల్ గేట్‌వే కార్యాలయాన్ని ప్రారంభించడాన్నీ నాయకులు స్వాగతించారునిపుణులునైపుణ్య శ్రామిక శక్తివిద్యార్థుల రాకపోకలకు వీలుగా చట్టబద్ధమైన మార్గాలను ప్రోత్సహించడంలోనూభారత్–ఈయూ మధ్య ప్రజా సంబంధాలను బలోపేతం చేయడంలోనూ ఈ కార్యాలయం పోషించే పాత్రను వారు గుర్తించారువాణిజ్యంపెట్టుబడులుప్రజా సంబంధాలు పెరిగే కొద్దీ  నిపుణులువిద్యార్థులుపరిశోధకులువ్యాపారుల రాకపోకలను కూడా విస్తరించడం అవసరమని వారు అంగీకరించారుఅనుసంధానాన్ని బలోపేతం చేయడానికున్న ప్రాధాన్యాన్ని నాయకులిద్దరూ స్పష్టం చేశారుబెల్జియంభారత్ మధ్య నేరుగా విమాన అనుసంధానాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని విమానయాన సంస్థలను ప్రోత్సహించారుభారత్ నుంచి అర్హత కలిగిన నర్సులు బెల్జియం వెళ్లేందుకు వీలు కల్పించే కార్యక్రమాలుఆరోగ్యసేవలువిద్యా రంగాల్లో రెండు దేశాల మధ్య కొనసాగుతున్న పౌర సమాజ సహకారంతో సహా ఆరోగ్య రంగంలో బెల్జియం ఆరోగ్య సేవా సంస్థలుభారత్ మధ్య కొనసాగుతున్న సహకారాన్ని వారు స్వాగతించారురవాణావలసలకు సంబంధించిన ఎంవోయూపై సంతకం చేసే దిశగా చర్చలు కొనసాగించాలని ప్రోత్సహించారు.

బెల్జియన్ ఎకనామిక్ మిషన్ సందర్భంగా కుదిరిన అనేక విద్యా భాగస్వామ్యాలను ప్రధానమంత్రి మోదీ గుర్తు చేసుకున్నారుభారత నూతన విద్యా విధానం ప్రకారం ఇక్కడ క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని బెల్జియం విశ్వవిద్యాలయాలనుప్రఖ్యాత విద్యా సంస్థలను ఆహ్వానించారుభారత్బెల్జియం దేశాలకు చెందిన నైపుణ్యాభివృద్ధిసాంకేతికవృత్తి విద్యశిక్షణ (టీవీఈటీరంగాల్లో సహకారాన్ని అన్వేషించాలని రెండు దేశాలకు చెందిన సంబంధిత అధికారులనూసంస్థలనూపారిశ్రామిక ప్రతినిధులనూ నాయకులిద్దరూ ప్రోత్సహించారుఉత్తమ పద్ధతులను పంచుకోవడంపరిశ్రమ అవసరాలకు తగిన శిక్షణ అందించడంశిక్షణ ఇచ్చేవారిమదింపుదారుల సామర్థ్యాల పెంపుఅప్రెంటిస్‌షిప్పులుపని ఆధారిత అభ్యాసంఅభివృద్ధి చెందుతున్నభవిష్యత్తు నైపుణ్యాల్లో సహకారంఅర్హతా ప్రమాణాలను పరిగణించడంవాటిని గుర్తించడంపై చర్చలు లాంటి చర్యలు చేపట్టాలని సూచించారుతద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడానికిపరస్పర ప్రయోజనం అందేలా నిపుణుల రాకపోకలను మెరుగుపరచడానికి వీలు కలుగుతుందన్నారుభారతీయ సంస్థలతో కలసి పరిశోధనా సహకారంఆవిష్కరణలువిజ్ఞాన వినిమయాన్ని ప్రోత్సహించడంలో ఫ్లెమిష్ ఇనిస్టిట్యూట్ ఫర్ టెక్నలాజికల్ రీసెర్చి (వీఐటీవోపోషిస్తున్న పాత్రను నాయకులు ప్రశంసించారుసుష్మా స్వరాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీస్బెల్జియం ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ ఫారిన్ అఫైర్స్ మధ్య దౌత్య పరమైన శిక్షణలో సహకారాన్ని వారు స్వాగతించారు.

అంతర్జాతీయ సమస్యలు

ఉక్రెయిన్పశ్చిమాసియా ప్రాంతాల్లో ఇటీవలి పరిణామాలతో సహా అంతర్జాతీయ పరిణామాలపై ప్రధానమంత్రులు ఇద్దరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారుఉక్రెయిన్ యుద్ధం విషయానికి వస్తే ఐక్యరాజ్యసమితి చార్టర్ నియమాలుఅంతర్జాతీయ చట్టాలకు లోబడి చర్చలుదౌత్యం ద్వారా సమగ్రమైనన్యాయబద్ధమైనశాశ్వతమైన శాంతిని సాధించే దిశగా చేపట్టే ప్రయత్నాలకు తమ మద్దతును ఉభయపక్షాలు పునరుద్ఘాటించాయిపశ్చిమాసియాకు సంబంధించి ఆ ప్రాంతంలో ఆందోళన కలిగిస్తున్న తాజా పరిణామాలను వారు చర్చించారుశాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవడంలో చర్చలుదౌత్య విధానాల ప్రాధాన్యాన్ని వారు స్పష్టం చేశారుసముద్ర మార్గాల రక్షణభద్రతను నిర్దారించడంసురక్షితమైనఆటంకాలు లేని నౌకాయానాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని వారు తెలియజేశారు.

పరస్పర విశ్వాసంశాంతిసంక్షేమంఅభివృద్ధి కోసం ఉమ్మడి లక్ష్యంతో భారత్–బెల్జియం భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలోవిస్తృతం చేయడంలో తమకున్న నిబద్ధతను ఇద్దరు ప్రధానులు పునరుద్ఘాటించారుప్రజాస్వామ్యంచట్టంమానవ హక్కుల పట్ల గౌరవంస్త్రీ పురుష సమానత్వంనిబంధనల ఆధారిత అంతర్జాతీయ క్రమం పట్ల ఉన్న ఉమ్మడి నిబద్ధత అందిస్తున్న మార్గదర్శకత్వంలో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు వారు అంగీకరించారుఈ పునాదుల ఆధారంగా నిర్మితమైన భారత్–బెల్జియం సహకారం రెండు దేశాల ప్రజలకు,  ప్రపంచానికి ప్రయోజనాన్ని చేకూరుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారుఅలాగే ఉమ్మడి అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడానికిభారత్ఐరోపా మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి సైతం దోహదపడుతుందని భావిస్తున్నారు.

భారత్బెల్జియం మధ్య సహకారం బలోపేతమవుతున్నవిస్తరిస్తున్న నేపథ్యంలోభారత్–ఐరోపా భాగస్వామ్యాలుభారత్–ఈయూ సంబంధాలు పెరుగుతున్న తరుణంలో ఉభయపక్షాలకు అనువైన సమయంలో ద్వైపాక్షిక పర్యటన కోసం బెల్జియం రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రధాని బార్ట్ డి వెవర్ ఆహ్వానించారు.

 

***