Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బ్రిక్స్ సదస్సులో భాగంగా న్యూఢిల్లీలో అబుదాబి యువరాజుతో సమావేశమైన ప్రధానమంత్రి

బ్రిక్స్ సదస్సులో భాగంగా న్యూఢిల్లీలో అబుదాబి యువరాజుతో సమావేశమైన ప్రధానమంత్రి


సెప్టెంబర్ 12, 2026న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా యువరాజు గౌరవ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్‌తో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

బలమైన రాజకీయసాంస్కృతికవాణిజ్యఇంధనప్రజల మధ్య సంబంధాలపై ఏర్పడిన భారత్యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ప్రాముఖ్యతను ఇరువురు నాయకులు స్పష్టం చేశారుజనవరి 2026లో యూఏఈ అధ్యక్షుడు గౌరవ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత్‌ పర్యటననుమే 2026లో యూఏఈలో ప్రధానమంత్రి పర్యటనను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

బ్రిక్స్ వేదికపై భారత్‌ అధ్యక్షతన యూఏఈ క్రీయాశీలకనిర్మాణాత్మక భాగస్వామ్యాన్ని ప్రధానమంత్రి అభినందించారుభారత్‌ అధ్యక్షతన బ్రిక్స్ సాధించిన సానుకూల ఫలితాలను ఇరువురు నాయకులు స్వాగతించారుఉమ్మడి ప్రయోజనాలుప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లేందుకు బ్రిక్స్ సహకారాన్ని మరింత బలోపేతం చేయటానికి ఇరుదేశాలు ఈ వేదిక ద్వారా కలిసి పని చేస్తూనే ఉంటాయని స్పష్టం చేశారు.

వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల్లో సాధించిన పురోగతిని నాయకులు గుర్తించారుభారతదేశంలోనే అతి పెద్దదైన అల్యూమినియం పెట్టుబడిగా ఒడిశాలో 11.5 బిలియన్ డాలర్ల వ్యయంతో సమీకృత గ్రీన్‌ఫీల్డ్ అల్యూమినియం ప్రాజెక్టు అభివృద్ధి కోసం యూఏఈకి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ పెట్టుబడి పెట్టనున్నట్లు చేసిన ప్రకటనను స్వాగతించారుఒడిశాను ప్రపంచ అల్యూమినియం తయారీ కేంద్రంగా ఈ ప్రాజెక్టు తీర్చిదిద్దుతుందని భావిస్తున్నారు.

భారత్యూఏఈ మధ్య పరస్పర ప్రయోజనాల కోసం భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయటంలో యూఏఈ సరికొత్త సార్వభౌమ పెట్టుబడి నిధి ఎల్ఇమాద్ పోషించగల కీలక పాత్రను ఇరుదేశాల నాయకులు గుర్తించారురక్షణఅంతరిక్షంఅణుశక్తిసాంకేతికతఆవిష్కరణలతో సహా వ్యూహాత్మకఅభివృద్ధి చెందుతున్న రంగాల్లో రెండు దేశాల మధ్య సహారాన్ని పెంపొందించుకునే అవకాశాలపై వారు చర్చించారు.

ఈ పర్యటన భారత్యూఏఈల మధ్య శాశ్వతమైన బంధానికి మూలమైననిరంతర నాయకత్వ స్థాయి సంప్రదాయాన్నితరతరాలుగా వస్తున్న అనుబంధాన్ని మరోసారి స్పష్టం చేసింది.

 

****