Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సంవత్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


జైన ధర్మంలో అత్యంత పవిత్రం, ముఖ్య వార్షికోత్సవం అయిన ‘సంవత్సరీ’ (క్షమాపణలు కోరే దినోత్సవం) సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. క్షమ, పశ్చాత్తాపం ప్రతి బంధాన్ని బలోపేతం చేస్తాయని ‘సంవత్సరీ’  మనకు  గుర్తుచేస్తుందని శ్రీ మోదీ అన్నారు. వినమ్రత భావనను ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని, దయ, సహృదయత్వం… ఇవి ముందున్న మార్గంలో మనకు అండగా నిలిచేటట్లు చూసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘క్షమాగుణం, దయాళుత్వం మానవ సంబంధాలను బలోపేతం చేస్తాయని ‘సంవత్సరీ’  మనకు గుర్తుచేస్తుంది. ఈ పవిత్ర సందర్భం…
వినయం మనకు మార్గదర్శనం చేసేటట్లుగాను, దయతో పాటు సౌహార్దం మనం చేసే ప్రతి పనిలోనూ ప్రతిఫలించేటట్లుగాను మరోసారి సంకల్పం చెప్పుకొందాం.
మిచ్ఛామి దుక్కడమ్  (మన అన్ని చెడు పనులు, లేదా పొరపాట్లు క్షమకు పాత్రమవుగాక)’’ అని పేర్కొన్నారు.