Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సామరస్యం, పరస్పర అవగాహనను తెలియజేసే సంస్కృత సుభాషితాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి


సామరస్యం, పరస్పర అవగాహన, ఆప్యాయతల విలువలను చాటే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు.

సహృదయం సన్మనస్యమవిద్వేషం కృణేమి వః

అన్యో అన్యమభి హర్యత్ వత్సం జాతమివాఘ్న్యా

ద్వేషం విడనాడి మంచి మనసుతో అందరూ కలసిమెలసి ఉండాలని ఇది పిలుపునిస్తుంది. దూడను ఆవు ఎంత ప్రేమగా చూస్తుందో… అలాగే మనుషులు కూడా ప్రేమగా, సామరస్యంగా ఉంటూ ఎవరినొకరు పరస్పరం అర్థం చేసుకోవాలని ఇది తెలియజేస్తుంది.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్ లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

సహృదయం సన్మనస్యమవిద్వేషం కృణేమి వః

అన్యో అన్యమభి హర్యత్ వత్సం జాతమివాఘ్న్యా