పిఎంఇండియా
ధైర్య సాహసాలు, జ్ఞాన గుణాల ప్రాధాన్యాన్ని బోధిస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
‘‘అద్వైధమనసం యుక్తం శూరం ధీరం విపశ్చితమ్
న శ్రీః సన్త్యజతే నిత్యమాదిత్యమివ రశ్మయః’’ అనేదే ఆ సుభాషితం.
‘సాహసవంతులు, స్థిర చిత్తులు, వివేక వంతులు, శక్తి మంతుల సరసనే సమృద్ధి సదా నిలిచివుంటుంది.. సరిగ్గా కిరణాలు ఎల్లప్పుడూ సూర్యునితో జతపడిఉన్నట్లుగానే’ అని ఈ సుభాషితం మనకు తెలియజెబుతోంది.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘అద్వైధమనసం యుక్తం శూరం ధీరం విపశ్చితమ్
న శ్రీః సన్త్యజతే నిత్యమాదిత్యమివ రశ్మయః’’ అని పేర్కొన్నారు.
अद्वैधमनसं युक्तं शूरं धीरं विपश्चितम्।
— Narendra Modi (@narendramodi) September 16, 2026
न श्रीः सन्त्यजते नित्यमादित्यमिव रश्मयः॥ pic.twitter.com/b2FYEzgBjn