పిఎంఇండియా
ఇంతవరకు ఏమంత శ్రద్ధకు నోచుకోని, తెర మరుగున ఉండిపోయిన, ఆదరణకు దూరమైపోయిన వర్గాల వారిని భారత్ అభివృద్ధి ప్రస్థానం ఎలా పెద్ద ఎత్తున ప్రధాన స్రవంతిలో భాగస్వాములను చేస్తున్నదీ పూర్వ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ ఓ వ్యాసంలో వివరించారు. ఆ వ్యాసాన్ని గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రస్తావించారు.
‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’కు ప్రధానమంత్రి ఇస్తున్న ప్రాధాన్యాన్ని శ్రీ కోవింద్ తన వ్యాసంలో పేర్కొన్నారు. సమాజంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక హక్కులకు నోచుకోకుండా ఉపేక్షకు గురి అయిన వర్గాల వారికి ప్రస్తుతం భారత్ అభివృద్ధి ఫలాల అందజేతలో ప్రాధాన్యం లభిస్తోందని శ్రీ కోవింద్ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ:
‘‘ఇంతవరకు ఏమంత శ్రద్ధకు నోచుకోని, తెర మరుగున ఉండిపోయిన, ఆదరణకు దూరమైపోయిన వర్గాల వారిని భారత్ అభివృద్ధి గాథ పెద్ద సంఖ్యలో ప్రధాన స్రవంతిలోకి చేర్చుతోందని పూర్వ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ అంటున్నారు.
‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టి కేంద్రీకరించారని, సమాజంలో అంచులలో ఉండిపోయిన వర్గాల వారు ఇప్పుడు భారత్ అభివృద్ధి లక్ష్యాల పరంగా కేంద్ర స్థానానికి చేరుకోగలుగుతున్నారని పూర్వ రాష్ట్రపతి ప్రస్తావించారు’’అని తెలిపింది.
***
Former President Shri @ramnathkovind writes that India's development story is increasingly bringing those who were unheard, unseen or underserved into the mainstream.
— PMO India (@PMOIndia) September 17, 2026
He highlights PM @narendramodi's focus on Sabka Saath, Sabka Vikas and says the periphery is now moving to the… pic.twitter.com/grHuWNmsQv