Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆధునిక, సాంకేతికత ఆధారిత, వృత్తిపరంగా నిర్వహించే సంస్థగా


ఆధునికసాంకేతికత ఆధారితవృత్తిపరంగా నిర్వహించే సంస్థగా భారతీయ తపాలా శాఖ రూపాంతరం చెందిన విధానాన్ని వివరిస్తూ కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా రాసిన ఒక కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. రవాణాఆర్థిక సేవలుపౌర కేంద్రీకృత సేవల విభాగాల్లో తపాలాశాఖ తన విస్తృత సేవా పరిధిని డిజిటల్‌ సామర్థ్యాలతో అనుసంధానిస్తోందని ఈ వ్యాసం పేర్కొంది.

సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా రాసిన ఈ కథనంలో భారతీయ తపాలా శాఖ‌ ఆధునికసాంకేతికత ఆధారితవృత్తిపరంగా నిర్వహించే సంస్థగా మారుతున్న తీరును వివరించారు. రవాణాఆర్థిక సేవలుపౌర ఆధారిత సేవల విభాగంలో భారతీయ తపాలా శాఖ తన విస్తృతమైన వ్యవస్థను డిజిటల్ సామర్థ్యాలతో మేళవిస్తోందని ఆయన వివరించారు. సరిగ్గా అదే సమయంలో ‘డాక్ సేవాజన్ సేవా’ స్ఫూర్తితో విశ్వసనీయ ప్రజా సేవా పాత్రను ఇది నిరంతరం నిలబెట్టుకుంటోంది’’

 

***