Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ధర్మబద్ధ మార్గాన్ని అనుసరిస్తే సంతోషం, సౌభాగ్యం, శ్రేయస్సు కలుగుతాయని చెబుతున్న సుభాషితం… ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


ధర్మబద్ధ జీవనాన్ని గడపడంతో పాటు సరి అయిన మార్గదర్శకత్వాన్ని అందుకున్నప్పుడు సంతోషాన్నీ, సౌభాగ్యాన్నీ, శ్రేయస్సునీ పొందవచ్చని చెబుతున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.

సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

‘‘సుత్రామాణం పృథివీం ద్యామనేహసం సుశర్మాణమదితిం సుప్రణీతిమ్

దైవీం నావం స్వరిత్రామనాగసో అస్త్రవన్తీమా రుహేమా స్వస్తయే’’ అని పేర్కొన్నారు.

అన్ని వేళల్లో కాపాడుతూ ఉండే భూమినీ, విశాల అనంత ఆకాశాన్నీ మానవులు ఆశ్రయించి ఉందురు గాక. భూమ్యాకాశాలు వారికి సురక్షిత ఆశ్రయాన్ని ప్రసాదించడంతో పాటు ధర్మపాలనకు దోహదం చేస్తాయి. మానవులు పాపాల నుంచి విముక్తులై, పవిత్ర మార్గంలో ముందుకు సాగుతూ బలమైన, చక్కని పనితనమున్న చుక్కానిని కలిగివున్న ఓ దివ్యనౌక లో ప్రయాణించి సంతోషాన్నీ, సౌభాగ్యాన్నీ, శ్రేయస్సునీ అందించే గమ్యాన్ని చేరుకొందురు గాక అనే ఆకాంక్షను ఈ సుభాషితం వ్యక్తం చేస్తోంది.

***