Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా క్రీడల మహిళల 400 మీటర్ల పరుగులో కాంస్యం గెలిచిన ప్రాచీ చౌదరిని అభినందించిన ప్రధానమంత్రి


ఆసియా క్రీడల మహిళల 400 మీటర్ల ఈవెంట్‌లో కాంస్య పతకం గెలుచుకున్న ప్రాచీ చౌదరిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.

ఆమె తన అద్భుత ప్రదర్శనతో దేశానికి చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించిపెట్టిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆమె భవిష్యత్ ప్రయత్నాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శ్రీ మోదీ తన శుభాకాంక్షలను తెలిపారు.

 ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

“ఆసియా క్రీడల మహిళల 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం గెలుచుకున్న ప్రాచీ చౌదరికి అభినందనలు. ఆమె అద్భుత ప్రదర్శనతో దేశానికి పతక వేదికపై చిరస్మరణీయ స్థానం లభించింది. ఆమె భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు.”