Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

షహీద్ భగత్ సింగ్ జయంతి నేపథ్యంలో ఆయనకు ప్రధానమంత్రి నివాళి


   షహీద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు నివాళి అర్పించారు.

అకుంఠిత దీక్ష, ధైర్యసాహసాలతో స్వాతంత్ర్య పోరాటానికి భగత్‌ సింగ్‌ కొత్త ఒరవడి దిద్దారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశ గౌరవప్రతిష్టల కోసం సర్వం త్యాగం చేసిన ఆయన స్ఫూర్తి భారత యువతరం మనోస్థయిర్యానికి, సంకల్పానికి ప్రతీకగా నిలిచిందని శ్రీ మోదీ కొనియాడారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా ఇచ్చిన సందేశంలో:

“అమరవీరుడు భగత్ సింగ్ జయంతి నేపథ్యంలో ఆయనకు నా నివాళి. అకుంఠిత దీక్ష, ధైర్యసాహసాలతో స్వాతంత్ర్య పోరాటానికి నవ్యోత్తేజమిచ్చారు. దేశ గౌరవప్రతిష్టల కోసం జీవితాన్నే త్యాగం చేయడానికి సిద్ధపడిన ఆయన సంకల్పం భారత యువతరం  ధైర్యసాహసాలకు, పట్టుదలకు ప్రతీక” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.