పిఎంఇండియా
ఆసియా క్రీడల్లో పురుషుల స్క్వాష్ సింగిల్స్‌లో రజత పతకం సాధించిన అభయ్ సింగ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
అభయ్ నైపుణ్యం, అంకితభావం దేశానికి గర్వకారణంగా నిలిచాయని అన్నారు. కొన్నేళ్లుగా ఆయన పడిన కష్టానికి దక్కిన విజయమిదని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.
“ఆసియా క్రీడల్లో పురుషుల స్క్వాష్ సింగిల్స్‌లో రజతం గెలిచిన అభయ్ సింగ్‌కు శుభాకాంక్షలు. అతని నైపుణ్యం, అంకితభావం దేశానికి గర్వకారణం. ఈ విజయం.. కొన్నేళ్లుగా ఆయన పడిన కష్టాన్ని ప్రతిబింబిస్తుంది. అతను భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా: పీఎం శ్రీ నరేంద్రమోదీ“
Congratulations to @abhaysinghk98 on winning the Silver Medal in Men’s Singles Squash at the Asian Games! His skill and determination have made India proud. This achievement reflects the hard work he has put in over the years. Best wishes to him for the journey ahead: PM… pic.twitter.com/P6g2iSupq6
— PMO India (@PMOIndia) September 27, 2026