పిఎంఇండియా
ఆసియా క్రీడల్లో మహిళల ట్రాప్ టీమ్ విభాగం రజత పతక విజేతలు మనీషా కీర్, నీరూ, ఆషిమా అహ్లావత్లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
అత్యంత కచ్చితత్వం, ఏకాగ్రత, సమష్టి కృషితో వారు అద్భుత ప్రతిభను ప్రదర్శించారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
భవిష్యత్తులోనూ ఈ బృందం మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ, దేశ కీర్తిప్రతిష్టలను వారు మరింత ఇనుమడింపజేయగలరని శ్రీ మోదీ ఆశాభావం వెలిబుచ్చారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా ప్రధానమంత్రి కార్యాలయం పంపిన సందేశంలో:
“ఆసియా క్రీడలలో మహిళల ట్రాప్ టీమ్ విభాగం రజత విజేతలు మనీషా కీర్, నీరూ, ఆషిమా అహ్లావత్లకు నా హృదయపూర్వక అభినందనలు. వారి ఏకాగ్రత, కచ్చితత్వం, సమష్టి కృషికి లభించిన ప్రశంసనీయ విజయమిది. ఈ బృందం ఇంతకన్నా మెరుగ్గా రాణిస్తూ దేశానికి మరింతగా కీర్తి ప్రతిష్టలు ఆర్జించిపెట్టాలని ఆశిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నట్లు తెలిపింది: PM @narendramodi”
****