పిఎంఇండియా
ఆసియా క్రీడల్లో మహిళల 75 కిలోల బాక్సింగ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన లవ్లీనా బోర్గోహెయిన్కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఫైనల్లో 5-0 తేడాతో ఘన విజయం సాధించి ఆమె స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు.
లవ్లీనా క్రీడా ప్రస్థానం అసాధారణమైన దృఢ సంకల్పం, ప్రతిభకు నిదర్శనమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
లవ్లీనా బోర్గోహెయిన్ భవిష్యత్ ప్రయత్నాల్లో మరిన్ని విజయాలు సాధించాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.
“ లవ్లీనా బోర్గోహెయిన్ అద్భుత ప్రదర్శన కనబరిచారు! ఆసియా క్రీడల్లో మహిళల 75 కిలోల బాక్సింగ్ విభాగంలో ఫైనల్లో 5 – 0 తేడాతో ఘన విజయం సాధించి స్వర్ణ పతకం గెలుచుకున్న లవ్లీనా బోర్గోహెయిన్కు అభినందనలు. ఆమె క్రీడా ప్రస్థానం అసాధారణమైన దృఢ సంకల్పం, ప్రతిభకు నిదర్శనం. భవిష్యత్ లో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొంది.
***
A very fine performance from @LovlinaBorgohai!
— PMO India (@PMOIndia) October 2, 2026
Congratulations to Lovlina on winning Gold in the Women’s 75 kg Boxing event at the Asian Games with an emphatic 5-0 victory in the final. Her sporting journey reflects remarkable determination and excellence. Wishing her the very… pic.twitter.com/cbvdOp03dV