Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా క్రీడలలో రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో రజత సాధించిన ధీరజ్ బొమ్మదేవర, కుంకుమ్ అనిల్ మోహోద్‌లకు ప్రధానమంత్రి అభినందనలు


ఆసియా క్రీడల్లో రికర్వ్ మిక్స్‌డ్ జట్టు విభాగంలో రజత పతకం సాధించిన ధీరజ్‌ బొమ్మదేవర, కుంకుమ్‌ అనిల్‌ మోహోద్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

అద్భుతమైన నైపుణ్యం, ఉత్సాహాన్ని ప్రదర్శించిన వారు, ఆసియా క్రీడల్లో ఈ విభాగంలో భారత్‌కు తొలిసారిగా రజత పతకాన్ని అందించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

ఈ చిరస్మరణీయ విజయాన్ని సాధించిన ఇద్దరు ఆర్చర్లను అభినందించిన శ్రీ మోదీ.. వారి భవిష్యత్తు‌ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలిపారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా చేసిన పోస్టులో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.

‘‘అద్భుతమైన రజతం. 

ఆసియా క్రీడల్లో రికర్వ్‌ మిక్స్‌డ్‌ జట్టు విభాగంలో రజత పతకం సాధించిన ధీరజ్‌ బొమ్మదేవర, కుంకుమ్ మోహోద్‌ల విజయంపై గర్వంగా ఉంది.

 

వారు అద్భుతమైన నైపుణ్యం, ఉత్సాహాన్ని ప్రదర్శించి, ఆసియా క్రీడల్లో ఈ విభాగంలో మన దేశానికి తొలిసారిగా రజత పతకాన్ని అందించారు.

 

ఈ చిరస్మరణీయ విజయాన్ని సాధించిన మన ఇద్దరు ఆర్చర్లకు అభినందనలు. వారి భవిష్యత్తు‌ ప్రయత్నాలకు శుభాకాంక్షలు: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’