Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్వాతంత్రయోధుడు శ్యామ్‌జీ కృష్ణవర్మ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి


ప్రముఖ విప్లవకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు శ్యామ్‌జీ కృష్ణవర్మ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

 

భరతమాత దాస్య విముక్తి కోసం శ్యామ్‌జీ కృష్ణవర్మ తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

మాతృభూమి గౌరవాన్ని కాపాడేందుకు ఆయన ప్రదర్శించిన ధైర్యసాహసాలనూ, అంకితభావాన్నీ దేశం ఎన్నటికీ మరువలేదని శ్రీ మోదీ అన్నారు.

 

“ప్రముఖ విప్లవకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు శ్యామ్‌జీ కృష్ణవర్మ జయంతి సందర్భంగా ఆయనకు సాదర నివాళులు. భరతమాతను బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేసేందుకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. మాతృ దేశ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఆయన ప్రదర్శించిన ధైర్యసాహసాలనూ, అంకిత భావాన్నీ దేశం ఎన్నటికీ మరువదు” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో పోస్టు చేశారు.

***