పిఎంఇండియా
శ్రీ స్వపన్ దాస్గుప్త రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
తరతమ భేదాలతో కూడిన పాత వ్యవస్థను భగ్నం చేయడం ద్వారా ప్రధానమంత్రి భారతదేశానికి సరికొత్త దిశానిర్దేశాన్ని అందించారని శ్రీ స్వపన్ దాస్గుప్త ఓ వ్యాసంలో వివరించారు. సంస్కరణలనూ, సంక్షేమాన్నీ.. సాంస్కృతిక గౌరవాన్నీ, సాంకేతిక విజ్ఞానాన్నీ మిళితం చేసి సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులకే అందేటట్లు చూస్తూ, ఆర్థిక సంస్కరణలను డిజిటల్ వేదికల సాయంతో అమలు చేస్తున్న తీరును ఆ వ్యాసంలో ప్రస్తావించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ:
‘‘తరతమ భేదాలతో కూడిన పాత వ్యవస్థను రూపుమాపి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత గాథకు సరికొత్త భాష్యాన్ని అందించారని శ్రీ స్వపన్ దాస్గుప్త రాశారు.
సంస్కరణలనూ, సంక్షేమాన్నీ.. సాంస్కృతిక గౌరవాన్నీ, సాంకేతిక విజ్ఞానాన్నీ మేళవించి సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులకు మాత్రమే అందిస్తూ, డిజిటల్ వేదికల సాయంతో ఆర్థిక సంస్కరణలను అమలు చేస్తున్న తీరును ఆయన ప్రస్తావించారు.
లోతైన ఆలోచనకు అద్దం పడుతున్న ఈ కథనాన్ని చదవగలరు’’ అని పేర్కొంది.
***
Shri @swapan55 writes that PM @narendramodi has recrafted India's story by dissolving the old world of binaries. He highlights how reforms and welfare, cultural pride and technology have been brought together, with targeted welfare delivery and digital platforms working alongside economic reforms. Do read this thoughtful piece.
— PMO India (@PMOIndia) October 8, 2026