పిఎంఇండియా
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ ఏక్నాథ్ షిండే రాసిన వ్యాసాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు.
సేవ, అభివృద్ధి, దేశ నిర్మాణానికి ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితం ప్రతీకగా నిలుస్తోందని శ్రీ ఏక్నాథ్ షిండే ఈ వ్యాసంలో రాశారు. గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు.. మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం, సంక్షేమం, సాంస్కృతిక వారసత్వంపై ప్రధాని దృష్టి సారించారన్నారు. ఇవన్నీ భారతదేశ అభివృద్ధి ప్రయాణాన్ని తీర్చిదిద్దాయని పేర్కొన్నారు. దృఢమైన, స్వయం సమృద్ధమైన భారత్ అనే దార్శనికతతో వికసిత్ భారత్–2047 దిశగా తదుపరి దిశ అభివృద్ధి ముందుకు సాగుతోందని తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం పోస్టు:
‘‘సేవ, అభివృద్ధి, దేశ నిర్మాణానికి ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితం ప్రతీకగా నిలుస్తోందని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ ఏక్నాథ్ షిండే ఈ వ్యాసంలో రాశారు
గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు.. మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం, సంక్షేమం, సాంస్కృతిక వారసత్వంపై దృష్టి సారించారు.
దృఢమైన, స్వయం సమృద్ధమైన భారతదేశం అనే దార్శనికతతో వికసిత్ భారత్ దిశగా తదుపరి–2047 దశ అభివృద్ధి ముందుకు సాగుతోంది.’’
****
PM @narendramodi's 25 years in public life reflect a journey of service, development and nation-building, writes Maharashtra Deputy CM Shri @mieknathshinde. From Gujarat to Delhi, the focus on infrastructure, technology, welfare and cultural heritage has shaped India's development journey. The next phase looks towards Viksit Bharat 2047, with a vision of a stronger and self-reliant India.
— PMO India (@PMOIndia) October 8, 2026