Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థపై వచ్చిన వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


కేంద్ర సహాయ మంత్రి శ్రీ జితేంద్ర సింగ్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

 

సమృద్ధి, సుస్థిరత, దేశీయ సామర్థ్యానికి భారత ‘సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ (బ్లూ ఎకానమీ)’ ఒక మార్గంగా నిలుస్తోందని ఈ వ్యాసం తెలియజేస్తుంది. ‘సప్త-ధార’ దృక్పథంలో భాగంగా ఇది జీవనోపాధిని, ఆహార- ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి.. యువతకు కొత్త అవకాశాలను సృష్టించడానికి విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, వ్యవస్థాపకతను ఒకచోట చేర్చుతుంది.

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:

 

“సమృద్ధి, సుస్థిరత, జాతీయ సామర్థ్యానికి భారతదేశ ‘సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ’ శక్తిమంతమైన మార్గంగా ఆవిర్భవిస్తోందని కేంద్ర సహాయ మంత్రి శ్రీ జితేంద్ర సింగ్ రాశారు.

 

‘సప్త-ధార’ దృక్పథంలో భాగంగా ఇది జీవనోపాధిని, ఆహార- ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి.. యువతకు కొత్త అవకాశాలను సృష్టించడానికి విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, వ్యవస్థాపకతను అనుసంధానిస్తుంది.”