పిఎంఇండియా
జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించిన నూతన జీఎస్టీ సంస్కరణలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. వస్తు, సేవల పన్ను విధానాన్ని సరళంగా, మరింత సమర్థంగా, పౌరహితంగా మార్చే దిశగా వేసిన ముందడుగుగా అభివర్ణించారు. అరెస్టుకు దారి తీసే నిబంధనల తొలగింపునకూ, నేర రహితం చేయడానికీ, ప్రక్రియలను సులభతరం చేయడానికీ సంబంధించి కౌన్సిల్ చేసిన సిఫారసుల గురించి శ్రీ మోదీ వివరించారు. ఈ చర్యలు పన్ను చెల్లింపుదారులపై, వ్యాపారాలపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ పోస్టు:
జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించిన నూతన జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తున్నాను.
అరెస్టు నిబంధనలను తొలగించేందుకు, నేర రహితం చేసేందుకు, ప్రక్రియలను సులభతరం చేసేందుకు కౌన్సిల్ చేసిన సిఫారసులు సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి.
లక్ష్యం సుస్పష్టం:
వేగవంతమైన నిర్ణయాలు.
తక్కువ పాలనా ఖర్చులు.
మానవ ప్రమేయం లేకుండా డబ్బులు వెనక్కి ఇవ్వడం (రిఫండ్).
విశ్వాసం ఆధారిత పరిపాలన.
జీఎస్టీని మరింత సమర్థంగా, పారదర్శకంగా, పౌరహితంగా మార్చేందుకు చేపడుతున్న నిరంతర ప్రయత్నాల్లో ఇవి భాగంగా ఉన్నాయి.
****
I welcome the new round of GST reforms approved by the GST Council. The Council’s recommendations on removal of arrest provisions, greater decriminalisation and simpler procedures will have a very positive impact. The focus is clear: Faster decisions. Lower compliance costs. Automated refunds. Trust-based administration. These are in line with our constant efforts to make GST more efficient, transparent and citizen-friendly.
— Narendra Modi (@narendramodi) October 8, 2026