భారతదేశంలో కార్యకలాపాల విస్తరణకు, దేశ ఆర్థిక వ్యవస్థ, మార్కెట్లు, ప్రజలతో సంబంధాలను బలపరిచేందుకు బ్లూమ్‌బెర్గ్ ప్రణాళికలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు.
సామాజిక మాధ్యమం’ఎక్స్‘లో మైక్ బ్లూమ్‌బెర్గ్ ఇలా పోస్టు చేశారు. “భారత్‌లో వరుసగా సుదీర్ఘకాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రి“గా శ్రీ నరేంద్ర మోదీని అభివర్ణించారు. భారత్ సాధించిన వేగవంతమైన ఆర్థిక వృద్ధిని, ప్రపంచ నాయకత్వ వృద్ధిని కొనియాడారు. ప్రధానమంత్రి దార్శనికతను ప్రస్తావిస్తూ… భారత్‌లో బ్లూమ్‌బెర్గ్ సంస్థ ప్రారంభమై 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిపిన చర్చలు సంతోషానిచ్చాయని అన్నారు. దేశంలో తమ సంస్థ కార్యకలాపాల విస్తరణ ప్రణాళికలను ఈ సందర్భంగా వెల్లడించారు.
మైక్ బ్లూమ్‌బెర్గ్ పోస్టుకు ‘ఎక్స్‘ వేదికగా శ్రీ నరేంద్ర మోదీ స్పందించారు. మైక్ బ్లూమ్‌బెర్గ్‌ను కలవటం సంతోషంగా ఉందన్నారు. భారత్‌లో బ్లూమ్‌బెర్గ్ ప్రారంభమై 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంస్థను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
భారతదేశంలో బ్లూమ్‌బెర్గ్ ఉనికి విస్తరణకు, దేశ ఆర్థిక వ్యవస్థ, మార్కెట్లు, ప్రజలతో అనుబంధాన్ని మరింతగా బలోపేతం చేసుకునేందుకు ఆ సంస్థ చేస్తున్న ప్రణాళికలను శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. భారతదేశ వృద్ధి ప్రయాణం ద్వారా వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలు పుట్టుకొస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి ఇలా అన్నారు.
“ఈ రోజు ఉదయం మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది. భారతదేశంలో 30 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు బ్లూమ్‌బెర్గ్ సంస్థకు అభినందనలు. భారతదేశంలో బ్లూమ్‌బెర్గ్ ఉనికి విస్తరణకు ఆర్థిక వ్యవస్థ, మార్కెట్లు, ప్రజలతో సంబంధాలను మరింత బలపరచుకోవటానికి బ్లూమ్‌బెర్గ్ చేస్తున్న ప్రణాళికలను మేం స్వాగతిస్తున్నాం. భారతదేశ అభివృద్ధి ప్రయాణం వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలను సృష్టిస్తోంది“.
***
It was a delight meeting you this morning. Congratulations to Bloomberg on completing 30 years in India. We welcome Bloomberg's plans to expand its presence in India and deepen its engagement with our economy, markets and people. India’s growth story continues to create immense opportunities across sectors.
— Narendra Modi (@narendramodi) October 13, 2026