Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా పారా గేమ్స్‌లో రజత పతక విజేత భాగ్యశ్రీ జాదవ్‌కు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి


ఆసియా పారా గేమ్స్‌.. మహిళల షాట్‌పుట్ ఎఫ్34 పోటీలో అద్భుత త్రోతో పాటు, అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనను ఇచ్చి రజత పతకాన్ని గెలిచి మరో సారి భారతదేశ ప్రజలు సంతోషపడేటట్లు చేసిన భాగ్యశ్రీ జాదవ్‌‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.

వెనుకటి సంచికతో పోలిస్తే ఆమె తన ఆటతీరును మెరుగుపరుచుకుని నిరంతర శ్రమ, వరుసగా మెరుగైన ప్రదర్శన ద్వారా దృఢ సంకల్పాన్ని చాటారని ప్రధానమంత్రి అన్నారు. ఈ విజయానికి ఆమె అర్హురాలని శ్రీ మోదీ అభినందనలు తెలిపారు. ఆమె పట్టుదల నిజానికి ఇతరులకూ స్ఫూర్తిదాయకమేనన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ ఇలా పేర్కొంది:

‘‘ఆసియా పారా గేమ్స్2లో మరో రజత పతకంతో పాటు, వ్యక్తిగత సర్వశ్రేష్ఠ ప్రదర్శన!

మహిళల షాట్‌పుట్ ఎఫ్34 పోటీలో భాగ్యశ్రీ జాదవ్ అద్భుత త్రోతో రజత పతకాన్ని సాధించి, భారతీయులు సంతోషించేటట్లు చేశారు. వెనుకటి సంచిక కన్నా, తన ఆటతీరును మెరుగుపరుచుకొని, అసాధారణ నిరంతర శ్రమనీ, దృఢ సంకల్పాన్నీ చాటి ప్రతిభకు పదును పెట్టుకున్నారు. ఈ విజయానికి ఆమె అర్హురాలు. ఆమెకు ఇవే అభినందనలు. ఆమె పట్టుదల నిజంగానే ఎంతో స్ఫూర్తిదాయకం: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’.

***