Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా పారా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పిన సందీప్‌ కుమార్‌కు ప్రధానమంత్రి అభినందన


ఆసియా పారా క్రీడల్లో పురుషుల 400 మీటర్ల టీ64 విభాగంలో స్వర్ణ పతకం సాధించి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పిన సందీప్‌ కుమార్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  అభినందించారు. తొలి ప్రయత్నంలోనే అద్భుత ప్రదర్శనతో ఈ ఘనత సాధించిన సందీప్‌ ఆసియా పారా క్రీడల్లో భారత్‌కు 100వ పతకాన్ని అందించడం ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

సందీప్‌ ప్రదర్శన దేశానికి గర్వకారణమైన మైలురాయి అని పేర్కొన్న ప్రధానమంత్రి, ఆయన భవిష్యత్తులోనూ ఇలాగే రాణిస్తూ దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు.

“భారత పారా అథ్లెటిక్స్‌కు ఇది బంగారు క్షణం! ఆసియా పారా క్రీడల్లో పురుషుల 400 మీటర్ల టీ64 విభాగంలో స్వర్ణ పతకం సాధించి, కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పిన సందీప్‌ కుమార్‌కు అభినందనలు. తొలి ప్రయత్నంలోనే ఆయన అద్భుతమైన  ప్రదర్శన కనబరిచారు. ఆసియా పారా క్రీడల్లో భారత్‌కు 100వ పతకాన్ని అందించడం ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపింది. ఆయన ఇలాగే రాణిస్తూ దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నట్టు ఆయన కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు చేసింది.