Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దృఢ సంకల్పం, నిరంతర శ్రమల ప్రాధాన్యాన్ని చాటే సంస్కృత సుభాషితాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి


కలకాలం నిలిచివుండే విజయాన్ని సాధించడానికి దృఢ సంకల్పం, నిరంతర శ్రమ ముఖ్యమని చాటుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు.
‘‘సువ్యాహృతాని ధీరాణాం ఫలతః పరిచిన్త్య యః
అధ్యవస్యతి కార్యేషు చిరం యశసి తిష్ఠతి’’ అని ఆయన పేర్కొన్నారు.
ధీరులు, వివేకవంతులిచ్చే మంచి సలహాలను, వాటి ఫలితాలను సమీక్షించుకొని ఆ ప్రకారం పనులను దృఢ సంకల్పంతో, నిరంతర ప్రయత్నంతో పూర్తి చేసే వ్యక్తులు దీర్ఘకాలం పాటు నిలిచివుండే కీర్తిని, గౌరవాన్ని సాధించడంతో పాటు చరిత్రలో తమదైన స్థానాన్ని కూడా సంపాదించుకొంటారని పైన చెప్పిన సుభాషితానికి అర్థం.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘సువ్యాహృతాని ధీరాణాం ఫలతః పరిచిన్త్య యః
అధ్యవస్యతి కార్యేషు చిరం యశసి తిష్ఠతి’’ అని పేర్కొన్నారు.